రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. తమిళ, తెలుగు భాషల్లో శనివారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంపై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. 4డీ టెక్నాలజీతో ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమా కోసం చిత్రబృందం ఎంతగా కష్టపడిందో ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతోంది.

ట్రైలర్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేశారు. 'సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే.. సెల్ ఫోన్ చూడగానే ప్రాణభయంతో చెల్లాచెదురవుతారవుతారు చూడు' అంటూ విలన్ పాత్ర అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగ్ ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.