Asianet News TeluguAsianet News Telugu

పాలిటిక్స్ కు కాస్త బ్రేక్... ఏప్రిల్ అంతా షూటింగ్స్ తో బిజీ కాబోతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ లో బిజీ కాబోతున్నారు.  తాను కమిట్ అయిన సినిమాలకు టైమ్ కేటాయించబోతున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న షూటింగ్స్ పై ఓనిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంతకీ పవన్ ఏం చేయబోతున్నారు. 
 

Power Star Pawan Kalyan Bussy Shooting Schedule In April JMS
Author
First Published Mar 24, 2023, 12:47 PM IST

పాలిటిక్స్ టూర్లలో.. బీజీ బిజీగా ఉన్నారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారడంతో.. ఎక్కువగా ఏపీ టూర్ లో బిజీగా ఉన్నారు. జనసేనను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు.. వరుసగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ . అయితే ఇటు సినిమాల విషయంలో కూడా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా.. వరుసగా సినిమాలు షెడ్యూల్ చేసుకుంటున్నాడు బ్యాక్ టూ బ్యాక్  సినిమాలు సెట్స్ఎక్కిస్తూ.. టైమ్ ఉన్నప్పుడు ఆసినిమాలు కంప్లీట్ చేస్తూ.. అటు పాలిటిక్స్ ను.. ఇటు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు పవన్. 

ఇక ఈక్రమంలో చాలా రోజులుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న పవర్ స్టార్.. ఏప్రిల్ అంతా షూటింగ్స్ కు కేటాయించాలి అని నిర్ణయించుకున్నాడట. అందుకోసం షెడ్యూల్స్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్టు  తెలుస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార్ ప్రస్తుంతం నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు. హిస్టారికల్ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కుతోన్న హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా దాదాపు కంప్లీట్ కావస్తోంది. ఇక రీసెంట్ గా తమిళ రీమేక్ సినిమా వినోదయ సీతయం సినిమా కూడా షూటంగ్ దశలోనే ఉంది. ఈ రెండు కాకుండా సాహో సజిత్ తో మరో సినిమా సెట్స్ ఎక్కాల్సి ఉంది. 

ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే.. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మరో ఎత్తు.. ఈ సినిమా  కమిట్ అయ్యి రెండేళ్ళకు పైనే అవుతుంది. ఈమూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు కాని... అది ముందుకు సాగలేదు. దాంతో ఈసారి ఎక్కువ టైమ్ ఈసినిమాకే కేటాయించాలి అని ఫిక్స్ అయ్యాడట పవర్ స్టార్. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ .. ఉస్తాద్ భగత్ సింగ్ కు దాదాపు 10 రోజులు కేటాయించినట్టు తెలుస్తోంది. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్న ఓజీ షూటింగ్ కూడా వచ్చే నెలలోనే షురూ చేయబోతున్నాడట. ఇప్పటికే సముద్రఖని డైరెక్షన్‌లో నటిస్తున్న వినోదయ సీతమ్‌ షూటింగ్ దశలో ఉంది. ఈ లెక్కన పవన్ కల్యాణ్‌ ఏప్రిల్‌లో బ్యాక్ టు బ్యాక్‌ షూటింగ్స్‌ తో బిజీ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

పవన్ షూటింగ్ న్యూస్ విని..  ఫ్యాన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  ఈ ఏడాది రెండు సినిమాలన్నా వస్తే బాగుండు అంటూ కలలు కంటున్నారు.. ఆశపడుతున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఇక దీనితో పాటు పవర్ స్టార్ హరిహరవీరమల్లు పై అప్ డేట్ ఇవ్వాల్సి ఉంది. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ చాలా నెలల క్రితం మొదలవగా.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ ఏదాది రిలీజ్ అవ్వల్సిన వాటిలో ఈమూవీ కూడా ఉంది. మరి ఈ సినిమాకు ముందుగా మోక్షం వస్తుందా లదా అనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios