Asianet News TeluguAsianet News Telugu

Latha Mangeshkar : ‘లతా మంగేష్కర్’ కోలుకోవాలని ఆటో డ్రైవర్ తాపత్రాయం.. ఆయన త్యాగం నిజంగా గొప్పది..

లెజెండరీ గాయని, భారత్ రత్న గ్రహీత లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూనే చికత్స పొందుతున్నారు. డాక్టర్లు  ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. కాగా లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ఓ ఆటోడ్రైవర్ గొప్ప త్యాగం చేశాడు. 
 

One of the Latha Mangeshkar's Fan Done a Gereat Job, Social Media Post
Author
Hyderabad, First Published Jan 23, 2022, 12:21 PM IST

తన గొంతుతో 5‌0 ఏండ్లుగా  ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకుంది. తన కోకిల లాంటి గానంతో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. అలాంటి లతా మంగేష్కర్ కరోనాకు గురై ప్రస్తుతం  ముంబైలోని బ్రీచ్ ఆస్ప్రతిలో చేశారు. రెండు వారాలుగా ఆమె ఐసీయూలోనే ఉంది.  ఆమెకు ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తోంది. 

ఇటీవల లతా మంగేష్కర్ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు అప్డేట్ కూడా ఇస్తూ వచ్చారు.  మహారాష్ర్ట వైద్య శాఖ మంత్రి రాజేష్ టోపే సైతం లతా మంగేష్కర్ ఆరోగ్యం  పట్ల చింతించాల్సిన పనిలేదన్నారు. తనకు ఇంకా ఐసీయూలోనే ఉన్న ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగవుతున్నదని తెలిపారు. అయితే ఇటీవల లతా మంగేష్కర్ ఆరోగ్యంపై పలు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న తరుణంలోనూ వైద్యులు స్పందించి లతా మంగేష్కర్ బాగానే ఉన్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.

అయితే లతా మంగేష్కర్ తిరిగి మామూలు స్థితిలోకి రావాలని అటు సినీ ప్రముఖులు, ఇటు అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో కూడా తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక అభిమాని, ఆటో డ్రైవర్ మాత్రం గాన కోకిల త్వరగా కోలుకోవాలని గొప్ప త్యాగం చేశాడు.

ముంబైకి చెందిన సత్యావాన్ జీత్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి  నుంచి లతా మంగేష్కర్ కు వీరాభిమాని. ఆమెను దేవి సరస్వతిగా భావిస్తున్నాడుు సత్యవాన్. అయితే లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ట్రీట్ మెంట్ పొందుతున్న నేపథ్యంలో తన మనస్సు చలించింది. ఆమె పాటలతో నిండిపోయిన ఆ గుండె ‘లతా’ త్వరగా కోలుకోవాలని తాను ఆటో నడిపగా వచ్చిన ఆదాయాన్ని విరాళంగా అందించాడు. మళ్లీ లతా మంగేష్కర్ పాటలు వినాలని ఆకాంక్షిస్తున్నారు. 

కాగా, సత్యవాన్ తన ఆటోను మొత్తం గ్రీన్ మ్యాట్ తో డేకరేట్ చేసి, లతా మంగేష్కర్ పాడిన పాటలను ప్లే చేస్తూ ఆటోను నడుపుతున్నాడు. పైగా ఆటో సైడ్ వాల్స్ పై లతా మంగేష్కర్ పొందిన పురస్కారాలు, అవార్డులు, ఆమె హిట్ సాంగ్స్ లిరిక్స్ రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మంగేష్కర్ కోలుుకోవాలని నిత్యం దేవుడికి ప్రార్థిస్తున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios