Asianet News TeluguAsianet News Telugu

శివుడిగా అక్షయ్ కుమార్ అద్భుతం.. ఓ మై గాడ్ సీక్వెల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రయోగం అంటే ముందుంటారు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్. సినిమాకోసం ఎంత డిఫరెంట్ గా మారమన్నా మారుతారు. అందులో భాగంగా అక్షయ్.. తాజాగా భూడిత వంటికి పూసుకున్న శివునిగా మారిపోయారు. ఇంతకీ ఏసినిమా కోసం ఆలుక్. 

OH My God Sequel Movie Akshay Kumar Shankar Look Poster Release JMS
Author
First Published Jun 9, 2023, 11:22 AM IST

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం హిందీలో వచ్చిన ఓ మై గాడ్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే.  ఉమేష్ శుక్ల దర్శకత్వంతో రూపొందిన ఈసినిమా అప్పుడు పెద్ద సంచలనమే అయ్యింది. బాక్సాఫీస్ దగగర భారీగా వసూలు చేసింది సినిమా. ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డుల అంతా ఇంతా కాదు. భూకంపం వలన ఓ వ్యక్తి తనకు జీవనోపాధినిచ్చే షాపును కోల్పోతాడు.తను నాస్తికుడు కావడంతో అందరూ దేవుడుని నమ్మకపోవడం వల్లే ఇదంతా జరిగిందని అంటుంటారు. దాంతో ఆ దేవుడిపైనే ఆ వ్యక్తి కేసు వేస్తాడు. ఇక అతన్ని గెలిపించడం కోసం స్వయంగా దేవుడే దిగి వస్తాడు.  ఆ దేవుడి పాత్రలో.. అక్షయ్ కుమార్ నటించి మెపపించారు. 

అయితే దేవుడే చివరివరకూ.. అతని వెంట ఉండి న్యాయంగెలిచేలా చేసి వెళ్తాడు.. ఇక ఈసినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో.. గోపాల గోపాల టైటిల్ తో..  రీమేక్ చేశారు. కిషోర్ కుమార్ డైరెక్ట్ చేసిని ఈసినిమా  ఇక్కడ కూడా  సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. బాలీవుడ్ లో ఓ మై గాడ్-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మరోసారి  ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పంకజ్ త్రిపాఠి కీలకపాత్రలో నటిస్తున్నాడు.

 

 

అయితే ఈసారి మాత్రం దర్శకుడు మారిపోయాడు. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో పాటు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా పస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చేతిలో ఢమరుకం పట్టుకుని జుట్టును వీరబోసుకుని ఉన్న అక్షయ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడుగా కనిపించనున్నాడు. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తుంది. వాకావ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే వీక్ సందర్భంగా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios