మంచు మనోజ్ వాట్ ది ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే నేడు ఈ చిత్రం నుంచి సర్ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో మెగా డాటర్ నిహారిక ఈ చిత్రంలో జాయిన్ అయింది.
మంచు మనోజ్ తన కెరీర్ లో నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఈ ఏడాది కొన్ని నెలల క్రితం మంచు మనోజ్ భూమా మౌనికని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మంచు విష్ణు పూర్తిగా కెరీర్ పై ఫోకస్ చేశాడు. ఇటీవల ఓ ఛానల్ లో మంచు మనోజ్ ఉస్తాద్ అనే షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే మంచు మనోజ్ వాట్ ది ఫిష్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అయితే నేడు ఈ చిత్రం నుంచి సర్ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో మెగా డాటర్ నిహారిక ఈ చిత్రంలో జాయిన్ అయింది. నేడు ఆమె తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది.
ఈ సందర్భంగా వాట్ ది ఫిష్ చిత్ర యూనిట్ మెగా డాటర్ కి ఫస్ట్ లుక్ తో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. నిహారిక ఫస్ట్ లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో నిహారిక వెలిగిపోతోంది. ఆమె పాత్ర పేరు ఆష్ అని తెలిపారు. అయితే నిహారిక పాత్ర పూర్తి పేరు అష్టలక్ష్మి అట. షార్ట్ గా ఆష్ అని పిలుస్తారు.
ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో డాలర్ సింబల్ కూడా ఉంది. అంటే మనీ చుట్టూ నిహారిక పాత్ర ఉండబోతోంది అని ఫస్ట్ లుక్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా నిహారిక పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సెలెబ్రిటీలు ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
పెళ్లి విడాకులతో రియల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నిహారిక ప్రస్తుతం పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సినిమాల్లో వచ్చిన అవకాశాలని వినియోగించుకోవాలని చూస్తోంది. వాట్ ది ఫిష్ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ వరుణ్ తెరకెక్కిస్తున్నారు.