తెలుగులో బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడి కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ కారణంగానే కౌశల్ విన్నర్ గా నిలిచాడు. షో మొదలైన కొద్దిరోజుల్లోనే విజేతగా కౌశల్ నిలుస్తాడనే విషయం అందరికీ అర్ధమైపోయింది.

అయినప్పటికీ కౌశల్ కారణంగానే షో టెలికాస్ట్ అయినన్ని రోజులు విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోయింది. ఇదంతా పక్కన పెడితే కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని కౌశల్ భార్య నీలిమ ఇదంతా చేయిస్తుందని బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని కామెంట్స్ చేశారు. హౌస్ లో ఉన్నప్పుడు బయటకి వచ్చినప్పుడు కూడా ఆయన అవే కామెంట్స్ చేశారు.

తాజాగా బాబు గోగినేనితో డిబేట్ కి దిగారు కౌశల్ అతడి భార్య నీలిమ.ఈ చర్చలో కౌశల్ ఆర్మీ అనేది బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం కాకముందే మొదలైందని, అంతా ముందే ప్లాన్ చేసుకొని కుటుంబ సభ్యులతో మేనేజ్ చేయించుకుంటూ కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడాడంటూ బాబు గోగినేని ఆరోపణలు చేశారు. దానికి అతడి దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కౌశల్ భార్య నీలిమ.. కౌశల్ ఆర్మీకి డబ్బులు ఇచ్చినట్లుగా మీ వద్ద ప్రూఫ్ ఉంటే మాట్లాడండి.. లేదంటే మాట్లాడకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశల్ పేరుతో సోషల్ మీడియాలో కొన్ని వేలకు పైగా అకౌంట్స్ ఉన్నాయి.. వాటన్నింటినీ డబ్బులిచ్చి క్రియేట్ చేయడం కుదురుతుందా అంటూ ప్రశ్నించింది. బాబు గోగినేనికి సోషల్ మీడియాపై అవగాహన లేనట్లు ఉందని ముందు ఆయన అవగాహన తెచ్చుకొని  మాట్లాడాలని కౌశల్ విమర్శలు చేశాడు. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తో బాబు గోగినేని డిబేట్!

బ్రహ్మీ ప్రోగ్రామ్ లో కౌశల్ పై సెటైర్లు!

పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!