ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

సాధారణంగా బిగ్ బాస్ లో పాల్గొనేది డబ్బు కోసం, క్రేజ్ కోసం, అంతకు మించి బిగ్ బాస్ నుంచి బయిటకు వచ్చాక వచ్చే ఆఫర్స్ కోసం. అలాగే సినిమా కెరీర్ లో వెనకబడి ..దాదాపు ఫేడవుట్ అయిన తనీష్ కూడా ఆశించాడు. బిగ్ బాస్ లో కూడా తనకు చేతనైనంతవరకూ కౌశల్ తో పోటిపడి రచ్చ రచ్చ చేసాడు. అయితే ఆ ఇంపాక్ట్ అతని సినిమా కెరీర్ కు ఎంతవరకూ ఉపయోగపడింది అంటే దాదాపు లేదనే చెప్పాలి.

తనీష్ తో చిన్న సినిమాలు చేసి రిలీజ్ కు సిద్దంగా ఉన్నవారంతా బిగ్ బాస్ నుంచి బయిటకు రాగానే ఆ క్రేజ్ తో రిలీజ్ చేసి ఓపినింగ్స్ రప్పించుకోవచ్చు..బిజినెస్ చేసుకోవచ్చు అని భావించారు. అలాంటి మ్యాజిక్ ఏదీ జరగకపోవటంతో అంతా నిరాశకు గురి అయ్యారు. తనీష్ కూడా ఇది ఊహించని పరిణామమే. క్రేజ్ మొత్తం కట్టుకట్టుకుని కౌశల్ చుట్టూ చేరటంతో మిగతా కంటిస్టెంట్స్ ఎవరూ హైలెట్ కాలేదు. వాస్తవానికి బిగ్ బాస్ నుంచి బయిటకు రాగానే...ఇంటర్వూలు ప్లాన్ చేసుకుంటారనుకున్నారు. 

అయితే మీడియావాళ్లు కౌశల్ కు ఇచ్చిన ప్రయారిటీలో వన్ పర్శంట్ కూడా మిగతా వాళ్ళకు ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో తనీష్ కొత్త చిత్రం `దేశ దిమ్మరి` రిలీజ్ కు రెడీ అయ్యింది. బిగ్ బాస్ త‌ర్వాత వేరే సినిమాల‌కు సంత‌కాలు చేయకపోవటంతో ఈ సినిమా అయినా యావరేజ్ అయితే బాగుండును అనే ఆలోచనతో ఉన్నాడు. అప్పటికి ఈ సినిమా కోసం `హే పైసా అంటూ డ‌బ్బు` పాట కూడా పాడాడు. అయినా ఈ సినిమాని పట్టించుకునే వాళ్లు లేరు. బిజినెస్ క్రేజ్ లేదు. నిజంగా ఇది తనీష్ కు బాధకలిగించే విషయమే. ఈ విషయంలో కౌశల్ చేసేదేమి లేదు. ఎందుకంటే అతను కావాలని చేసింది కాదు కదా.