కర్నూలు: బిగ్ బాస్ 2 విజేత కౌశల్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుుతోంది. రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని ఆలోచిస్తానని చెప్పడంతో ఆ ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన సన్నిహితుడని అంటారు. దీంతో ఆయన జనసేనలో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

రాజకీయాల్లోకి రాకుండా కూడా సేవ చేయవచ్చునని కౌశల్ అన్నారు. అయితే సమాజ సేవ చేయాలనేదే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. బిగ్‌బాస్ ఫేమ్‌తో కౌశల్‌కు అనేకమంది అభిమానులు ఏర్పడిన విషయం తెలిసిందే. కొందరైతే కౌశల్ గెలవాలంటూ షో సమయంలో ఏకంగా రన్‌ కూడా నిర్వహించారు. 

నాటి పరుగులో వేలాది మంది పాల్గొనడంతో అంతా విస్తుపోయారు. ఆయన కోసం కౌశల్ ఆర్మీ కూడా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో తన అభిమానులతో కలిసి సమాజసేవ చేస్తానని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తానని చెప్పడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది.