బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ గా వెళ్లిన సెలబ్రిటీలలో బాబు  గోగినేని, కౌశల్ లు ఉన్నారు. బాబు గోగినేని కొన్ని ఎపిసోడ్ల తరువాత షో నుండి ఎలిమినేట్ కాగా కౌశల్ టైటిల్ విన్నర్ గా నిలిచారు.

అయితే హౌస్ లో ఉన్నన్ని రోజులు బాబు గోగినేనికి, కౌశల్ కి మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. నువ్ గొప్పంటే నేను గొప్ప అనుకుంటూ ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉన్నారు. మధ్యలో కౌశల్ రాజీ పడాలని బాబు గోగినేని దగ్గరకి వెళ్లినా ఆయన కూడా 'ఊ' కొట్టినట్లే కొట్టి మళ్లీ గొడవలు పెట్టుకునేవారు.

కౌశల్ ని ఇంటి నుండి ఎలా పంపించాలని చర్చలు చేసేవారు బాబు గోగినేని. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ డిబేట్ లో పాల్గొనబోతున్నారు. మెల్బోర్న్ లో బాబు గోగినేని పేరుతో బాబు బర్గర్స్ అనే షాప్ ని ఓపెన్ చేశారు.

ఇటీవల అక్కడకి వెళ్లిన బాబు గోగినేనిని మెల్బా ఎంటర్టైన్మెంట్స్ తరఫున కౌశల్ తో డిబేట్ లో పాల్గొనాలని అడిగారట. దానికి బాబు గోగినేని, కౌశల్ ఇద్దరూ అంగీకరించడంతో ఈరోజు మెల్బోర్న్ లో వీరిమధ్య చర్చా కార్యక్రమం జరగనుంది. ఈ చర్చల్లో బిగ్ బాస్ హౌస్ విశేషాలతో పాటు బాబు గోగినేని బిగ్గర్ బాస్ అని ఎలా పిలిపించుకునేవారనే విషయాలను కౌశల్ చెప్పనున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

బ్రహ్మీ ప్రోగ్రామ్ లో కౌశల్ పై సెటైర్లు!

పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!