Asianet News TeluguAsianet News Telugu

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

అప్పట్లో అంటే బిగ్ బాస్ 2 నడిచేటప్పుడు కౌశ‌ల్ ఆర్మీ చేప‌ట్టిన బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత పెద్ద బిగ్ బాస్ షో టాపిక్ మెత్తం కౌశ‌ల్ వైపుకు డైవ‌ర్ట్ అయ్యింది. చివరకు  షో మెత్తం ఒక్క కౌశల్ మీదే ఆధారపడి నడుస్తుంది ఏమో అనిపించేలా తయారై, కౌశల్ గెలుపుతో ఓ కొలిక్కి వచ్చింది. 

kaushal army vs prabhas fans
Author
Hyderabad, First Published Oct 23, 2018, 11:50 AM IST

అప్పట్లో అంటే బిగ్ బాస్ 2 నడిచేటప్పుడు కౌశ‌ల్ ఆర్మీ  చేప‌ట్టిన బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత పెద్ద బిగ్ బాస్ షో టాపిక్ మెత్తం కౌశ‌ల్ వైపుకు డైవ‌ర్ట్ అయ్యింది. చివరకు  షో మెత్తం ఒక్క కౌశల్ మీదే ఆధారపడి నడుస్తుంది ఏమో అనిపించేలా తయారై, కౌశల్ గెలుపుతో ఓ కొలిక్కి వచ్చింది. 

అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కి ఏమయినా వ్యతిరేకంగా జరిగినా, లేదా బిగ్ బాస్ గా  నాని ఏమైనా మాట్లాడిన కానీ దాని ఎఫెక్ట్ అనేది బిగ్ బాస్ షో మొత్తం మీద పడింది. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది. అయితే కౌశల్ ఆర్మీ మాత్రం విశ్రాంతి తీసుకోవటం లేదు. బిగ్ బాస్ 2 విన్నర్ అయిన కౌశల్ కు తన ఆర్మీ సహాయం ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు ఇటీవలే ఆంధ్రపదేశ్ లో తిత్లి సైక్లోన్ తో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం లో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మరోసారి ఆర్మీ సత్తా చాటారు కౌశల్ ఆర్మీ

తాజాగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఎటాక్ చేసింది కౌశల్ ఆర్మీ. ప్రభాస్ కంటే... ప్రభాస్ అభిమానుల కంటే కౌశల్ ఆర్మీ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది కౌశల్ ఆర్మీ. 

ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా  జన్మదిన శుభాకాంక్షలు  చెప్పే క్రమంలో  కొంతమంది మద్య మాటా మాటా పెరిగింది. దాంతో  ప్రభాస్ కంటే కౌశల్...ఆయన  కౌశల్ ఆర్మీ గ్రేట్ అంటూపోస్ట్ లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో... ఆ ప్రభావం బాగానే కనపడుతోంది. దాంతో ఇదే మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

ఈ నేపధ్యంలో.. హీరో నాని తో కౌశల్ కు బిగ్ బాస్ 2 హౌజ్ లో పడకపోవటంతో.. నాని నటించిన దేవదాస్ ని ఫ్లాప్ చేస్తామంటూ  కౌశల్ ఆర్మీ చేసిన  ప్రతిజ్ఞ చేసిన విషయం గుర్తు చేస్తున్నారు. ఆ  మేరకు దేవదాస్ కు భారీ ఓపెనింగ్స్ రాకుండా అడ్డుకోవటం జరిగింది . అలాగే రీసెంట్ గా  ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత కు కౌశల్ ఆర్మీ పూర్తి  సపోర్ట్ ఇచ్చి..ఓపినింగ్స్ విషయంలో కలిసివచ్చేలా చేసింది. ఈ సంఘటనలతో కౌశల్ ఆర్మి సత్తా ఏమిటో స్టార్స్ కు తెలిసింది. ఈ నేపధ్యంలో ప్రభాస్ కొత్త చిత్రం ” సాహో ” విషయంలో సపోర్ట్ ఇస్తారో లేదో అన్న విషయం నడుస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

 

Follow Us:
Download App:
  • android
  • ios