బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ఆ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని అన్నారు. ఆదివారం నాడు కౌశల్ ఆర్మీ నిర్వహించిన విజయోత్సవ సభకు కుటుంబంతో సహా హాజరయ్యారు కౌశల్. ఈ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి.

''బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారనే విషయం తెలియక మధ్యలోనే వెళ్లిపోవాలని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే హోస్ట్ నాని కౌశల్ ఆర్మీ గురించి చెప్పారో అప్పుడు నా నిర్ణయం మార్చుకొని ఆట కొనసాగించాలని అనుకున్నాను. 

బిగ్ బాస్ షోలో గెలిచిన రూ.50 లక్షల ప్రైజ్ మనీని కేన్సర్ తో బాధపడే తల్లులని కాపాడడానికి వినియోగించనున్నాను. డబ్బు చేతికి రాగానే పనులు  మొదలుపెడతాను. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో మరో వారం రోజుల్లో వెబ్ సైట్ ప్రారంభించి, సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే అత్యుత్తమ సేవాసంస్థగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. నా షెడ్యూల్ మొత్తం ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తాను.

అభిమానులు ఎప్పుడు కలవాలని అనుకున్న ఆ షెడ్యూల్ ని బట్టి కలవొచ్చు. అలానే తాను బిగ్ బాస్ హౌస్ లో ధరించిన బట్టలను ఈ వెబ్ సైట్ ద్వారా వేలం వేసి దాని ద్వారా వచ్చే డబ్బుని సేవా కార్యక్రమాలకి వినియోగించనున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. అలానే కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని కొందరు అంటున్నారని పెయిడ్ ఆర్మీ అని నిరూపించలేకపోతే అభిమానులకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!