Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. రియాలిటీ షోలో ఏ కంటెస్టంట్ కి రానన్ని ఓట్లు సంపాదించుకున్నాడు కౌశల్. బయట అతడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో కౌశల్ కి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 1 లో విజేతగా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ కారణంగా పెద్దగా క్రేజ్ ఏం రాలేదనే చెప్పాలి. 

Double Profit For Kaushal
Author
Hyderabad, First Published Oct 27, 2018, 3:13 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. రియాలిటీ షోలో ఏ కంటెస్టంట్ కి రానన్ని ఓట్లు సంపాదించుకున్నాడు కౌశల్. బయట అతడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో కౌశల్ కి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 1 లో విజేతగా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ కారణంగా పెద్దగా క్రేజ్ ఏం రాలేదనే చెప్పాలి.

కానీ కౌశల్ విషయంలో అలా కాదు.. బిగ్ బాస్ సీజన్ 2 తో ఈ మోడల్ కమ్ యాక్టర్ కి అన్ని విధాల లాభాలే కలుగుతున్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న చాలా ఈవెంట్స్ కి కౌశల్ ని అతిథిగా పిలుస్తున్నారు. అంతేకాదు తన మోడలింగ్ ఏజెన్సీకి వచ్చే కాంట్రాక్ట్స్ కూడా బాగా పెరిగాయట.

ర్యాంప్ వాక్ చేయడానికి, అతిథిగా రావడానికి రెండు విధాలుగా చార్జ్ చేస్తున్నాడట కౌశల్. అతడికున్న క్రేజ్ కారణంగా నిర్వాహకులు కూడా భారీ మొత్తాన్ని ఇవ్వడానికి వెనుకడుగు వేయడం లేదు.

ఇప్పుడు కౌశల్.. గోవాలో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేస్తున్నాడట. దానికి కారణం అతడి కంపనీకి కోస్టల్ సిటీల నుండి కాంట్రాక్ట్ లు వస్తుండడంతో ప్రత్యేకంగా ఈ మీట్ ని ఏర్పాటు చేస్తున్నాడట. మొత్తానికి బిగ్ బాస్ షోతో కౌశల్ కి మంచి లాభమే జరిగిందని చెప్పాలి!

ఇవి కూడా చదవండి.. 

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

Follow Us:
Download App:
  • android
  • ios