యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'సాహో' చిత్రబృందం సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోని విడుదల చేసింది. అబుదబిలో ముప్పై రోజుల పాటు జరిపిన షూటింగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని 'షేడ్స్ ఆఫ్ సాహో' అనే పేరుతో సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'సాహో' చిత్రబృందం సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోని విడుదల చేసింది. అబు దబిలో ముప్పై రోజుల పాటు జరిపిన షూటింగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని 'షేడ్స్ ఆఫ్ సాహో' అనే పేరుతో సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

400 మంది చిత్రబృందం ఈ ఒక్క షెడ్యూల్ కోసం పని చేయడం విశేషం. అబు దబిలో 30 రోజుల పాటు షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని మేకింగ్ వీడియో ద్వారా తెలుస్తోంది. ఉన్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ మేకింగ్ వీడియోని చూస్తున్నంత సేపు టీజర్ చూస్తున్న ఫీలింగ్ ని కలిగించారు. నేపధ్య సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. నిమిషం 22 సెకన్ల పాటు సాగిన ఈ వీడియోలో చివరగా ప్రభాస్ కనిపించి అభిమానులను అలరించాడు. 

అతడి లుక్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Scroll to load tweet…