Asianet News TeluguAsianet News Telugu

ఇక నుంచి బాలయ్య నటసింహం కాదు.. గ్లోబల్ టైటిల్ తో గర్జించబోతున్న బాలకృష్ణ, స్పెషల్ సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ఇక నుంచి నటసింహం కాదు.. ముచ్చటగా మూడో సారి ఆయనకు కొత్త బిరుదు ను ఇచ్చారు అంతే కాదు దానికి సబంధించిన కొత్త సాంగ్ ను కూడా లాంచ్ చేశారు టీమ్. 
 

Nandamuri Balakrishna New Title Global Lion and Special Song Launch JMS
Author
First Published Jun 9, 2023, 10:22 AM IST

నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సాధించాడు నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ లో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకన్న ఆయనకు అభిమానులు మొదటిగా యువరత్న అని బిరుదు ఇచ్చారు. చాలా ఏళ్లు బాలయ్యకు యువరత్న అనే టైటిల్ కార్డ్ పడేది సినిమాలో.. ఇక ఆతరువాత వరుసగా సింహా సినిమాలు చేస్తూ రావడంతో.. బాలయ్యకు కొత్తగా నటసింహం బిరుదును ఇచ్చాను ఫ్యాన్స్. అది కూడా చాలా కాలం టైటిల్స్ లో పడటంతో పాటు.. బాలయ్య పేరు వచ్చినప్పుడల్లా నట సింహం అని పిలవడం మొదలెట్టారు.

 ఇక తాజాగా బాలయ్య పేరు పక్కన మరో కొత్త  టైటిల్ వచ్చి చేరింది. అయితే ఈసారి మాత్రం ఆశా మాషీటైటిల్ కాదు.. గ్లోబల్ రేంజ్ లో గర్జించేలా.. గ్లోబల్ లయన్ అనే బిరుదు ఇచ్చారు అభిమానులు ఇకపై ఆయన్ని ‘గ్లోబల్ లయన్’గా పిలవనున్నారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి టైటిల్ ను ట్విట్టర్ ద్వారా వెల్లడించగా.. ఆటైటిల్ కు సబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రేపు (10 జూన్) బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆరోజు సాంగ్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహాంచారు. ఈ ఈవెంట్ కు  సీనియర్ దర్శకులు బి.గోపాల్ తో పాటు.. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని.. ఇక బాలయ్య ఫ్యాన్స్ అసోషియేషన్ ప్రముఖులు పాల్గొన్నారు. 

బాలకృష్ణకు  గ్లోబల్ లయన్ బిరుదున ప్రకటించడంతో పాటు సాంగ్ ను లాంచ్ చేశారు టీమ్. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 108వ సినిమా చేస్తున్నాడు ఈసినిమా కు తాజాగా భగవంత్ కేసరి టైటిల్ ను రిలీజ్ చేవారు టీమ్. బాలయ్య బర్త్ డే సందర్భంగా రెండు రోజులు ముందే ఈ టైటిల్ ప్రకటించగా.. రేపు బాలకృష్ణ బర్త్ డే సదర్భంగా ఈసినిమా నుంచి స్పెషల్ టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకంటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతే కాదు బాలయ్య108 టైటిల్ రిలీజ్ సందర్భంగా 108 హోర్టింగ్ లతో ప్రత్యేకంగా టైటిల్ రిలీజ్ చేశారు టీమ్. 

ఇక ఈసినిమాలో కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ బాలయ్య జోడీగా నటిస్తుండగా.. శ్రీలీల ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది. తమిళ స్టార్ శరత్ కుమార్ బాలకృష్ణ సోదరుడిగా నటిస్తుండగా.. ప్రత్యేక పాత్రల్లో ఇతర నటీనటులు సందడి చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈమూవీలో లారీ డ్రైవర్ గా బాలకృష్ణ కనిపిస్తారని సమాచారం. ఇక ఈమూవీ తరువాత మెగా దర్శకుడు బాబీతో బాలయ్య సినిమా చేయబోతున్నాడు. త్వరలో ఈమూవీ లాంచ్ కుూడా జరగబోతున్నట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios