Asianet News TeluguAsianet News Telugu

నాగ్-చైతూ మల్టీస్టారర్ బంగార్రాజు షూటింగ్ స్టార్ట్!

 దర్శకుడు విక్రమ్ అక్కినేని వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మనం రికార్డు వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా విడుదలై చాలా కాలం అవుతుండగా మరోమారు నాగ్, చైతూ కలిసి మరో మల్టీస్టారర్ కి సిద్ధం అయ్యారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న బంగార్రాజు మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 

nagarjuna naga chaitanya combo bangarraju shooting start
Author
Hyderabad, First Published Aug 25, 2021, 6:16 PM IST


నాగార్జున, చైతు కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మనం బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకుడు విక్రమ్ అక్కినేని వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మనం రికార్డు వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా విడుదలై చాలా కాలం అవుతుండగా మరోమారు నాగ్, చైతూ కలిసి మరో మల్టీస్టారర్ కి సిద్ధం అయ్యారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న బంగార్రాజు మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 


నేడు ఈ మూవీ షూటింగ్ మొదలైనట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. నాగార్జున ట్విట్టర్ వేదికగా బంగార్రాజు షూటింగ్ ప్రారంభం కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని తెలియజేశారు. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి బంగార్రాజు సీక్వెల్. సోగ్గాడే చిన్నినాయనా నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాగార్జున డ్యూయల్ రోల్ చేయగా సోసియో ఫాంటసీ సబ్జెక్టు తో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించాడు. 


లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. సీక్వెల్ బంగార్రాజును దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరింత ఆసక్తిగా రూపొందిస్తున్నట్లు సమాచారం. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం క్రితమే బంగార్రాజు చిత్రానికి బీజం పడగా, అనేక కారణాల చేత ఆలస్యం కావడం జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios