హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.
హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 'డబుల్ దిమాక్' అనేది ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాటలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ రామ్‌తో కలిసి నటిస్తున్నారు.
రీసెంట్‌గా దిమాక్ ఖరాబ్ అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. లెటెస్ట్‌గా నభా నటేశ్ ఫోటోలు విడుదలయ్యాయి. ఇందులో నభా నటేష్ సరికొత్త లుక్‌లో, రూరల్ స్టైల్లో ఆకట్టుకుంటుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం వహించారు.
