సూపర్ స్టార్ మహేష్ బాబు  దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే టైటిల్ తో  సినిమాను మొదలు పెట్టి మరో హ్యాట్రిక్ కొట్టడానికి రంగం సిద్దం చేసిన సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే  ప్రస్తుతం కరోనా తో పెద్ద సినిమాల  షూటింగ్స్ ఏమీ జరగటం లేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో  వినిపిస్తున్నదాని ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం. దాంతో వచ్చే సంక్రాంతికి సినిమా థియోటర్స్ కు వచ్చే పరిస్దితి లేదు.

వాస్తవానికి సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేసి,అప్పుడు షూట్ ఫిక్స్ చేసారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మహేష్ మాత్రం తాను డిసెంబర్ దాకా షూట్ కు రానని, ఈ లోగా మిగతా ఆర్టిస్ట్ లతో తాను లేని పోర్షన్ లు పూర్తి చేసుకోమని చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మహేష్ లేని సీన్స్ అంటే తక్కువే ఉంటాయి కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా షూటింగ్ మొదలెట్టడం అనవసరం అని టీమ్ భావిస్తోందిట. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని ఖరారు చేస్తున్నట్లు సమాచారం. 

హీరోయిన్ గా కీర్తి సురేష్ ని సైతం ఫైనలైజ్ చేసారు.  మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ కన్ఫార్మ్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా తాను మహేశ్‌బాబు సినిమాలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు కీర్తీ సురేష్‌. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. 

సంగీతం  తమన్ అందించబోతున్నాడట.  అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో అరవింద స్వామి విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.