Asianet News TeluguAsianet News Telugu

‘2.0’ట్రైలర్ పై మహేష్ కామెంట్, అక్షయ్ ధాంక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్  ఎంతగానో ఎదురు చూస్తున్న ‘2.0’ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైన సంగతి తెలిసిందే.  జనం వద్ద ఉన్న సెల్‌ఫోన్లు గాలిలోకి ఎగిరిపోతూ ఉన్న సన్నివేశాలతో ట్రైలర్‌ ప్రారంభమైంది. 

mahesh babu tweet on 2.0 trailer
Author
Hyderabad, First Published Nov 6, 2018, 9:43 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘2.0’ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైన సంగతి తెలిసిందే.  జనం వద్ద ఉన్న సెల్‌ఫోన్లు గాలిలోకి ఎగిరిపోతూ ఉన్న సన్నివేశాలతో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘నమస్కారం.. సెల్‌ఫోన్లు హఠాత్తుగా మాయం. భయంతో ప్రజలు..’ అని న్యూస్‌ రీడర్‌ చెప్తూంటాడు.

ఇలా చాలా ఆశ్చర్యంగా ట్రైలర్‌ స్టార్ట్ అయ్యి మెస్మరైజ్ చేసేసింది. ట్రైలర్‌లో పక్షి , రోబో 2.0గా రజినీ తనను తాను పరిచయం చేసుకునే స్టైల్ దుమ్ము రేపాయి. ఇక విలన్ గా అక్షయ్  ‘సెల్‌ఫోన్‌ వాడుతున్న అందరూ హంతకులే. సెల్‌ఫోన్‌ చూడగానే ప్రాణభయంతో చెల్లాచెదురు అవుతారు చూడు’ అని  బెదిరిస్తున్నారు. ఇవన్నీతెలుగు సూపర్ స్టార్ మహేష్ కు కూడా బాగా నచ్చేసినట్లున్నాయి. 

దాంతో ఈ ట్రైలర్ పై మహేష్  బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ లో  ఆయన 2.0 టీంకి అభినందనలు తెలిపారు. ‘‘విజువల్స్, కాన్సెప్ట్ అదిరిపోయింది. చిట్టి విధ్వంసాన్ని స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్న. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్ మరియు టీం మొత్తానికి నా అభినందనలు’’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు.

వెంటనే  ఈ ట్వీట్‌ కు అక్షయ్ కుమార్ స్పందించారు. ఆయన మహేష్ ట్వీట్ ని రీట్వీట్ చేసి  ‘‘థ్యాంక్యూ’’ అని పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అక్షయ్ కుమార్ నెగిటివ్ హీరో పాత్రలో నటిస్తున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

మధ్యలో '2.0' చేయలేనని చెప్పేశా.. రజినీకాంత్ కామెంట్స్!

రాజమౌళికి శంకర్ ప్రశంస!

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios