ఒక ప్రక్క బడా చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతుండగా ఓటిటి లో మరికొన్ని చిత్రాలు, సిరీస్లు అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. మరి ఫిబ్రవరి నెలలో ఓటిటి లో ప్రసారం కానున్న చిత్రాలు లిస్ట్ చూస్తే ఈ విధంగా ఉంది.

గత రెండేళ్లుగా  డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి . కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడగా... జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు పట్టణ ప్రేక్షకులు మాత్రమే ఓటీటీలో చిత్రాలు చూసేవారు. ఈ మధ్య గ్రామాలలో కూడా ఓటీటీ లలో సినిమాలు చూడడం ఎక్కువైపోయింది. 

ఇక ఓటీటీ సంస్థలకు దక్కుతున్న ఆదరణ రీత్యా పలు కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటిటి సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతివారం తమ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో కొత్త చిత్రాలు, సిరీస్లు విడుదల చేస్తున్నాయి.  ఈ క్రమంలో ఈ నెలలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ ఫిబ్రవరిలో ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

విన్‌ కట్‌ టూ కట్‌

“నటీనటులు: దనిశ్‌ సైత్‌, ప్రకాశ్‌ బెల్వాడి. వినీత్‌
‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 3 ప్రసారం కానుంది.

రాకెట్ బాయ్స్

‘నటీనటులు: జిమ్‌ సరబ్‌, రెజీనా.

దర్శకత్వం: అభయ్‌ పన్ను

‘ఓటీటీ: సోనీలివ్‌ లో ఫిబ్రవరి 4 ప్రసారం కానుంది.

ది గ్రేట్ ఇండియన్ మర్డర్

నటీనటులు: రిచా చద్దా, ప్రతీక్‌

దర్శకత్వం: తిగ్మానుషు దులియా

‘ఓటీటీ: డిన్నీ. + హాట్‌స్టార్‌ లో ఫిబ్రవరి 4 ప్రసారం కానుంది.

లూప్ లపేట :

నటీనటులు: తాప్సీ, తాహిర్‌ రాజ్‌

దర్శకత్వం : ఆకాశ్‌ భాటియా

‘ఓటీటీ: నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4 ప్రసారం కానుంది.

మహాన్‌

నటీనటులు: విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్‌, సిమ్రన్‌, బాబ్‌ సింహా తదితరులు.

దర్శకత్వం: కార్తీక్‌ సుబ్బరాజు

‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 10 ప్రసారం కానుంది.

గ్రెహాహియా

‘నటీనటులు: దీపిక పదుకొణె, అనన్య పాండే,

దర్శకత్వం: షకున్‌ బత్రా

‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 11 ప్రసారం కానుంది.

మళ్లీ మొదలైంది

నటీనటులు: సుమంత్‌, నైనా గంగూలీ, వెన్నెల కిషోర్‌
దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్‌

‘ఓటీటీ: జీ5 లో ఫిబ్రవరి 11 ప్రసారం కానుంది.

భామా కలాపం :

నటీనటులు: ప్రియమణి, జానీ విజయ్‌, శరణ్య ప్రదీప్‌

దర్శకత్వం: ‘అభిమన్యు

‘ఓటీటీ: ఆహా లో ఫిబ్రవరి 11 ప్రసారం కానుంది.

ఫేమ్ గేమ్

నటీనటులు: మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ కపూర్‌, మానవ్‌ కౌల్‌

దర్శకత్వం: బెజోయ్‌ నంబియార్‌, కరిష్మా కోహ్లీ

‘ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌ లో ఫిబ్రవరి 24 ప్రసారం కానుంది.

బెస్ట్ సెల్లర్

నటీనటులు: శ్రుతిహాసన్‌, మిథున్‌ చక్రవర్తి, గౌహర్‌ఖాన్‌

దర్శకత్వం: ముకుల్‌ అభయంకర్‌

‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 18 ప్రసారం కానుంది.

83 :

నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, దీపిక పదుకొణె, జీవా
దర్శకత్వం: కబీర్‌ సింగ్‌

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ + హాట్‌స్పార్‌ లో ఫిబ్రవరి 18 ప్రసారం కానుంది.