Asianet News TeluguAsianet News Telugu

సౌత్ కొరియాను ఊపేస్తున్న ఊ అంటావా మావా సాంగ్..! మన టాలీవుడ్ గురించి ఏం చెపుతున్నారంటే..?

డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమా రికార్డ్స్ మీది రికార్డ్స్ సాధించింది. ఫస్ట్ టైమ్ బన్నీ ఈసినిమాతో పాన్ ఇండియాను టచ్ చేశారు. ఇప్పుడు ఈమూవీ ప్రభావం ఇండియాతో పాటు ఇతర దేశాల మీద కూడా పడింది.

Korean Group  Dance  To Pushpa Item Song Viral Video
Author
Hyderabad, First Published Jan 22, 2022, 4:33 PM IST

డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమా రికార్డ్స్ మీది రికార్డ్స్ సాధించింది. ఫస్ట్ టైమ్ బన్నీ ఈసినిమాతో పాన్ ఇండియాను టచ్ చేశారు. ఇప్పుడు ఈమూవీ ప్రభావం ఇండియాతో పాటు ఇతర దేశాల మీద కూడా పడింది.

పుష్పతో దుమ్మురేపాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన ఈమూవీ వందల కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రీసెంట్ గా అమెజాన్ లో రిలీజ్ అయిన పుష్ప ఓటీటీలో కూడా టాప్ వ్యూవర్ షిప్ ను సాధించింది. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో దుమ్మురేపి దంచికొట్టింది. అంతే కాదు పుష్ప పాటలు కూడా రికార్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కాని టీమ అంతా  అప్పటికప్పుడు అనుకుని పెట్టిన ఐటమ్ సాంగ్ మాత్రం అదరహో అనిపించింది. ముఖ్యంగా ఈ సాంగ్ కు సమంత అభినయం మెస్మరైజింగ్ అనుకోవాలి. ఊ అంటావా మావా ఊఊ అంటావా అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ ఇండియా అంతటా మారు మోగుతోంది. ఇండియాతో పాటు ఫారెన్ మ్యూజిక్ లవర్స్ ను డాన్సర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది సాంగ్.

 

పుష్ప సాంగ్స్ ప్రపంచ మంతా మారుమోగుతున్నాయి. అందులోను ఊ అంటావా పాట ఇంకా పాపులర్ అయ్యింది . దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఈ సాంగ్ కు రీసెంట్ గా సౌత్ కొంరియాకు చెందిని  బీటీఎస్ అనే డాన్స్ ట్రూప్ ఈసాంగ్ కు డిఫరెంట్ స్టెప్స్ వేసి చూపించారు. అంతే కాదు.. తమ డాన్స్ ట్రూప్ తో టాలీవుడ్ ను లింక్ చేస్తూ..  బీటీఎస్ లో టీ అంటే టాలీవుడ్ అంటూ .. క్యాప్పషన్ కూడా ఇచ్చారు టీమ్. అక్కడే కాదు సౌత్ కొరియా అంతటా పుష్ప సాంగ్స్ మారుమోగుతున్నాయి. మన తెలుగు సినిమాలు.. మన తెలుగు పాటలు అక్కడ ఫుల్ ఫేమస్ అయ్యాయి.

ఈ పాటకు తగ్గట్టు వారు వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సౌత్ కొరియావాళ్ళు మన పాటకు స్టప్పులు వేస్తూ.. మన టాలీవుడ్ ను మెచ్చుకోవడంతో మన వాళ్లు సోషల్ మీడియాలో ఫుల్ కుషీ అవుతున్నారు. అంతే కాదు ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరికి వారు శేర్ చేస్తూ.. వీడియోను ఇంకా వైరల్ చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios