Asianet News TeluguAsianet News Telugu

చిరు వల్ల టైమ్ వేస్ట్!

 కొత్త దర్శకుడు స్టార్ హీరో కోసం వెయిట్ చేయడమనేది కామన్, కానీ కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది కొరటాలతో వర్క్ చేయాలని చూస్తుంటే.. కొరటాల మాత్రం మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ హీరో కోసం మనం వెయిట్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాడు. 

koratala siva next project update
Author
Hyderabad, First Published Apr 12, 2019, 2:54 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వల్ల కొరటాల శివ టైమ్ చాలానే వెస్ట్ అవుతోంది. కొత్త దర్శకుడు స్టార్ హీరో కోసం వెయిట్ చేయడమనేది కామన్, కానీ కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది కొరటాలతో వర్క్ చేయాలని చూస్తుంటే.. కొరటాల మాత్రం మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ హీరో కోసం మనం వెయిట్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక సినిమా గత కొంత కాలంగా వాయిదాలు పడుతోన్న సంగతి తెలిసిందే. అసలైతే కొరటాల మెగాస్టార్ తో తన సినిమాను గత ఏడాది భరత్ అనే నేను తరువాతే మొదలుపెట్టాలి. కానీ ఏడాది అవుతున్నా ఇంకా కొత్త సినిమా మొదటి అడుగు కూడా పడలేదు. 

ఇప్పటికే ఏడాది పాటు కొరటాల శివ సమయం వృధా అయ్యింది. 5 నెలల్లో ఒక సినిమా పూర్తి చేయగల సత్తా ఉన్న కొరటాల చిరంజీవి సైరా వల్ల ఏడాది సమయాన్ని వృధా చేసుకోవాల్సి వచ్చింది. ఇక పరిస్థితులను అర్ధం చేసుకుంటూ వెళతున్న శివకు ఇప్పుడు మరో 5 నెలలు కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. 

ఎందుకంటే సైరా షూటింగ్ మే లో పూర్తవుతుందా లేదా అనేది డౌటే.. మళ్ళీ వచ్చే సంక్రాంతి సీజన్ కి సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్.  అంటే సైరా పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవని రూమర్స్ వస్తున్నాయి. మరి కొరటాల ఈ గ్యాప్ లో ఏదైనా ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారా? లేక మెగాస్టార్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేస్తారా? అనేది చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios