కన్నీళ్లు పెట్టిన ముక్కు అవినాశ్, తల్లి పరిస్థితి తలుచుకుని ఎమోషనల్ అయిన జబర్థస్త్ స్టార్ కమెడియన్
జబర్దస్త్ కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. బిగ్ బాస్ షోలోనూ పాల్గొని అలరించాడు. ప్రస్తుతం స్టార్ మాలో షోస్ చేస్తూ, ఆహాలో షోస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.తాజాగా ముక్కు అవినాశ్ జీవితంలో.. ఓ చిన్న కుదుపు వచ్చిపడింది.
జబర్దస్త్ కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. ఈ షోలో తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. తాను ఎక్కడ ఉన్నా నవ్వులే నవ్వులు అనేంతగా పేరుతెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలోనూ పాల్గొని అలరించాడు. ప్రస్తుతం స్టార్ మాలో షోస్ చేస్తూ, ఆహాలో షోస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ముక్కు అవినాశ్ జీవితంలో.. ఓ చిన్న కుదుపు వచ్చిపడింది. ఆ కష్టానికి తట్టుకోలేక ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ బాధాకరమైన విషయాన్ని పంచుకున్నాడు అవినాశ్. అమ్మకు ఇలా అవుతుందని ఊహించలేదు అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. న తల్లి అనారోగ్యానికి గురయ్యారని చెబుతూ అవినాష్ ఎమోషనల్ అయ్యారు. తన తల్లి మల్లమ్మకు ఆరోగ్యం బాగాలేదరని.. షూగర్ ఎక్కువ అవ్వడంతో ఇబ్బంది పడిందని.. సడెన్ గా సిక్ అయ్యి.. పరిస్థితి విషయించడంతో.. హైదరాబాద్ తీసుకువచ్చి.. ఇక్కడే ట్రీట్మెకంట్ చేయించామన్నాడు అవినాశ్.
అంతే కాదు గుండెకు సంబంధించి ఇబ్బంది ఉందని డాక్టర్స్ చెప్పారని. పరీక్షలు చేయగా.. తన గుండె చాలా వీక్ ఉందని గుండెకు రెండు పెద్ద బ్లాక్స్ ఉన్నాయని వెంటనే వైద్యులు తనకు స్టంట్ వేశారని తెలిపారు.ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే అమ్మ ఇలా ఆస్పత్రి బెడ్ పై ఉండడం చూసి తనకు కన్నీళ్లు ఆగడం లేదు అంటూ అవినాష్ బాధపడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక అవినాశ్ తల్లి కూడా.. తన పెద్ద కొడుకు ఉండబట్టి.. ఇలా బ్రతికి ఉన్నాను.. వాడేలేకుండే ఎప్పుడో ప్రాణాలుపోయేవి అంటూ ఎమోషనల్ అయినట్టు సమాచారం.
ఇక ఈమధ్యే అవినాశ్ కుటుంబంలో ఓ గుడ్ న్యూస్ కూడా వినిపించింది. తాను తండ్రి కాబోతున్నట్టు తన చానల్ లో వెల్లడించాడు అవినాశ్. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉందని వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం తన భార్య అనుజ నాలుగో నెల అని త్వరలోనే తాము పేరెంట్స్ హోదాని పొందబోతున్నట్టు, ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నట్టు తెలిపారు ముక్కు అవినాష్. ఇంతలోనే తనతల్లి అనారోగ్యం అవినాశ్ ను బాధపెట్టింది. ప్రస్తుతం ఆమె డిశ్చార్జ్ అయ్యి.. రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.