Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా జబర్థస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ వివాహం. శ్రీలేఖతో కలిసి ఏడడుగులు వేసిన కార్తిక్

ఈ ఏడాది ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్ళి బాజాలు మోగుతునాన్నాయి. వెండితెరతో పాటు బుల్లితెర తారలు కూడా వరుసగాపెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాజాగా జబర్థస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు అయ్యాడు. 
 

Jabardasth Comedian Kevvu Karthik Marriage With sreelekha JMS
Author
First Published Jun 9, 2023, 12:58 PM IST


ఈ ఏడాది వెండితెర.. బుల్లితెర తారలు వరుసగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. ఈ సమ్మర్ లో పెళ్లి  ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది  పెళ్లిపీటలెక్కేస్తున్నారు. సినిమా, టీవీ కు సంబంధించిన సెలబ్రెటీలు కూడా మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో  శర్వానంత్-రక్షిత రెడ్డి పెళ్లి జైపూర్ లో ఘనంగా జరిగింది. ఈరోజు వారి రిసెప్షన్ జరగబోతోంది. ఇక తాజాగా బుల్లితెర కమెడియన్ కార్తిక్ ఓ ఇంటివాడు అయ్యాడు. 

ఇక ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్  కూడా ఘనంగా జరగబోతోంది. ఈ ఏడాదే వీరి పెళ్ళి కూడా ఉండబోతున్నట్టు సమాచారం. ఇక అటు బుల్లితెర నుంచి  తాజాగా జబర్థస్త్  కమెడీయన్ కెవ్వు కార్తీక్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. శ్రీలేఖ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు . కార్తీక్-శ్రీలేఖ ల పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరు అయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. 

 

ఇటు  బుల్లితెర నుంచి కూడా పులువురు ఆర్టిస్ట్ లు  హాజరై పెళ్ళి వేదికపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్  రకరకాల కమెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా కొత్త జంట కు శుభాకాంక్షలు చెబుతూ.. మెసేజ్ లు పెడుతున్నారు. పెళ్లికి ముందే తన భార్యను సోషల్ మీడియాలో పరిచయం చేశాడు కార్తీక్. 

మొదట ఆమె కనిపించకుండా గేమ్స్ ఆడిన కార్తీక్.. ఆతరువాత తన భార్యను పరిచయం చేశాడు. ఇక తాజాగా  శ్రీలేఖ మెడలో  మూడు ముళ్ళు వేశాడు కార్తీక్. జబర్దస్ కామెడి షో ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లకు గుర్తింపు ఇచ్చింది. సామాన్యులను స్టార్స్ గా చేసింది. వారిలో చాలా మంది పూటగడవక ఇబ్బంది పడుతున్నవారుు ఉన్నారు.

 వారు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక చాలామంది మంచి స్థాయిలోకి వచ్చిన తరువాతే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఉన్నారు. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకడు.జబర్థస్త్ తో  మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కార్తీక్ ఒక‌రు. కార్తీక్ అంటే గుర్తుప‌ట్టే వారి సంఖ్య చాలా త‌క్కువ అయితే కెవ్వు కార్తీక్ అంటే మాత్రం వెంటనే గుర్తు పడతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios