Asianet News TeluguAsianet News Telugu

'ఆచార్య' ఫస్ట్ లుక్..ఆ సీన్ కు కాపీనా?

మెగాస్టార్ బర్త్‌ డే సందర్భంగా మూవీ యూనిట్‌ టైటిల్‌తోపాటు చిరు లుక్‌ను విడుదల చేసారు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ కాపీ అంటూ ఓ ప్రచారం మొదలైంది.

Is Chiranjeevis Acharya first look copy one?
Author
Hyderabad, First Published Aug 23, 2020, 8:27 AM IST

మెగాస్టార్ చిరంజీవి శనివారంతో 65వ పడిలోకి అడుగుపెట్టిన నేపధ్యంలో ఆయన తాజా చిత్రం ఆచార్య ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. తనదైన మెస్మరైజింగ్ నటన, స్టైలిష్ డ్యాన్స్‌, అదిరే పంచ్ డైలాగులతో తెలుగు ప్రేక్షకుల్లో  మరచిపోలేని ముద్ర వేసిన చిరు ..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా మిగతా సినిమాల లాగే ఈ మూవీ షూటింగ్‌కూ బ్రేక్ పడింది. మెగాస్టార్ బర్త్‌ డే సందర్భంగా మూవీ యూనిట్‌ టైటిల్‌తోపాటు చిరు లుక్‌ను విడుదల చేసారు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ కాపీ అంటూ ఓ ప్రచారం మొదలైంది.
 
కొన్ని మీడియా సంస్దలు ఈ మేరకు వార్తలు ప్రచురించాయి. వారు చెప్పేదాని ప్రకారం.. 18 నవంబర్ 2006లో  కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత, రైటర్స్ అసోసియేషన్ లో  పుణ్యభూమి అనే టైటిల్ తో ఓ కథ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో సినిమా టైటిల్స్ కు ముందు ఓ సీన్ వుంటుంది. అది ఆయన ఇలా రాసుకుని రిజిస్టర్ చేసారు.

ఆ సీన్ ఏమిటంటే...''.....సింహద్వారం దగ్గర జడల స్వామి....శిధిలావస్థలోవున్న ధర్మస్థలి సింహద్వారంపై ఓపెన్ చేస్తే, జడలస్వామి తన అనుచరులతో తదేకంగా సింహద్వారాన్ని, దూరంలోవున్న ఊరిని చూస్తూ,....ఎక్కడ అధర్మం రాజ్యమేలుతుందో,  ఎక్కడ అన్యాయం నాలుగు పాదాలతో నడుస్తోంది, అక్కడ భగవంతుడు తన విశ్వరూపం ప్రదర్శించి ధర్మస్థాపన చేస్తాడు. కానీ పద్దెనిమిదేళ్లు కావస్తున్నా, ఆ భగవంతునికి ఈ ఊరిపై జాలిపుట్టలేదు ఎందుకనో...అంటూ స్వామీజీ సింహద్వారాన్ని చూసి, రెండు చేతులు జోడించి, హర హర మహాదేవ శంభో శంకర అంటూ నిష్క్రమిస్తాడు.

దీన్నే విజువలైజ్ చేసి...నిన్నటి రోజు విడుదలయిన ఆచార్య ఫస్ట్ లుక్ రెడీ చేసారంటున్నారు. అయితే కేవలం ఓ సీన్ ని బేస్ చేసుకుని కాపీ అనటం అసంబద్దమైన విషయం. సిమిలర్ థాట్ అయ్యిండవచ్చు .కొరటాల శివ బేసిక్ గా మంచి రైటర్. అయితే శ్రీమంతుడు విషయంలో ఆయన కాపీ ఆరోపణలు,కేసులు ఎదుర్కొన్నారు. అనీల్ కృష్ణ రాసిన సీన్...ఎలా కొరటాల శివకు చేరుతుంది. ఆయన దాన్ని విజువలైజ్ చేసి ఇలా ఫస్ట్ లుక్ వదులుతారా...వదిలితే కాపీ అంటారు అని తెలియదా... అని ప్రశ్నలు అభిమానులు నుంచి వస్తున్నాయి. 

ఇక అనీల్ కృష్ణ గతంలో నందమూరి కళ్యాణ్ రామ్ తో ...అసాధ్యుడు, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య, సందీప్ కిషన్ తో రన్ చిత్రాలు చేసారు. మంచి క్రియేటివిటీ ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. కానీ సరైన బ్రేక్ ఇంకా రాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios