Asianet News TeluguAsianet News Telugu

అడవి శేష్ X శృతి హాసన్..చిత్రం టైటిల్ లీక్, అది ఏమిటంటే?!

ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ను డిసెంబర్ 18న రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే టైటిల్ ఇదే నంటూ ఒకటి బయిటకు వచ్చింది. అదేమిటంటే...

Intresting title for Adivi Sesh, Shruti Haasan Action Drama Jsp
Author
First Published Dec 18, 2023, 8:03 AM IST

తెలుగు లో థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయిన హీరో అడివి శేష్(Adivi Sesh). శేషు నుండి వచ్చిన దాదాపు అన్ని సినిమాలు థ్రిల్లర్ జానర్ లో వచ్చినవే. క్షణం, ఎవరు, గూఢచారి ఇలా దాదాపు అన్ని సూపర్ హిట్ గా నిలుస్తున్నారు. ఆ మద్యన వచ్చన దేశభక్తి చిత్రం మేజర్ సైతం బాగా వర్కవుట్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి తన సేఫ్ జానర్ లో మరోసారి ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి వస్తున్నారు శేష్. అది కూడా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి. ఇదే విషయాన్ని శృతి హాసన్, అడవి శేషు  తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు.  ఆ సినిమా టైటిల్ ఏంటనే ఆసక్తి  ఇప్పుడు మొదలైంది. 
  
ఇక  #SeshEXShruti అనే హ్యాష్ టాగ్ తో అనౌన్సమెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అందులో అడివి శేష్ లుక్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక అన్నపూర్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాను సానియేల్ డియో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ను డిసెంబర్ 18న రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే టైటిల్ ఇదే నంటూ ఒకటి బయిటకు వచ్చింది. అదేమిటంటే... #Dacoit. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తిగా అడివి శేష్‌ పూర్తి చేశాడు. తన గత చిత్రాలకు వర్క్ చేసిన షానీల్‌ డియో తో ఉన్న పరిచయం నేపథ్యం లో కొత్త సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయనకి ఇవ్వటం జరిగింది. యునైటెడ్‌ స్టేట్స్ లో పుట్టిన షానీల్ డియో తెలుగు లో చాలా సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాడు. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇప్పుడు షానీల్‌ డియో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి దర్శకుడిగా షానీల్ డియో ఎలాంటి ఫలితాన్ని ఆయన దక్కించుకుంటాడు అనేది చూడాలి. అలాగే  మరోసారి తన ఫెవరేట్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అడివి శేష్ ఈసారి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios