ఇలియానా తన కెరీర్, జీవితం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి సమాచారం. ఇలియానా తన భర్త, కొడుకుతో కలసి దేశం విడిచి వెళ్ళిపోతోందట.
గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. ఆమె బాలీవుడ్ కి వెళ్లినప్పటి నుంచి ఇలియానా కెరీర్ ముగింపు మొదలయింది అని చెప్పొచ్చు.
గతంలో లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. బాడీ అవుట్ ఆఫ్ షేప్ గా కూడా మారింది. ఓ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ఇలియానా కొంతకాలం రిలేషన్ షిప్ కొనసాగించింది. ఆ తర్వాత వీరిద్దరికి బ్రేకప్ జరిగింది. ఇటీవల ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఆగష్టు 1న ఇలియానా తల్లి అయ్యింది. దీనితో అనేక ప్రశ్నలు ఇలియానా భర్త ఎవరు ? అసలు పెళ్లి చేసుకుందా ? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన భర్త మిచెల్ డోలెన్ ని లోకానికి పరిచయం చేసింది. ఇలియానా తాను గర్భవతిని అని ప్రకటించడానికి కొన్ని నెలల వారాల ముందే వివాహం చేసుకుందట. అయితే ఇలియానా, మిచెల్ వివాహం ఎక్కడ జరిగింది ? ఎలా జరిగింది అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు లేవు.
ఇదిలా ఉండగా ఇలియానా తన కెరీర్, జీవితం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి సమాచారం. ఇలియానా తన భర్త, కొడుకుతో కలసి దేశం విడిచి వెళ్ళిపోతోందట. ఆమె యూఎస్ లో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్లు ఇలియానా సన్నిహితులు చెబుతున్నారు.
ఇక నటనపై ఇలియానాకి ఎలాంటి ఆసక్తి లేదని.. పైగా అవకాశాలు కూడా రావడం లేదని అంటున్నారు. దీనితో ఇలియానా తన భర్తతో కలసి యుఎస్ లో సెటిల్ అయి కొత్త లైఫ్ ని ప్రారంభించాలని అనుకుంటోంది. అక్కడకి ఆమె ఎలాంటి ప్లాన్స్ తో వెళుతోందో తెలియదు కానీ.. ఇండియాని విడిచి వెళ్లిపోవడం ఖాయం అని చెబుతున్నారు. యుఎస్ లో హ్యాపీగా, ప్రశాంతమైన జీవితం గడపడమే ఆమె ఉద్దేశం కావచ్చు అని అంటున్నారు.
ఇలియానా గ్లామర్, ఫిట్ నెస్ ఇంకా చెక్కు చెదరలేదు. ఆమె కోరుకుంటే కాస్త ఫోకస్ చేస్తే మంచి ఆఫర్స్ వస్తాయి. కానీ ఇలియానా సినిమాలని ఏమాత్రం ఆసక్తిగా లేదట. చాలా మంది సినీ తారలు కెరీర్ ముగిసాక ఫారెన్ వెళ్లిపోవడం గతంలో కూడా చూశాం. ఇలియానా టాలీవుడ్ లో మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, రామ్ , నితిన్ ఇలా స్టార్స్ అందరితో నటించింది.