Asianet News TeluguAsianet News Telugu

ఆ న్యూస్ విని షాక్ అయ్యాను.. నచ్చినట్టు రాసేస్తున్నారు... సోషల్ మీడియాపై హీరో శ్రీకాంత్ ఫైర్

సోషల్ మీడియాపై ఫైర్  అయ్యారు హీరో శ్రీకాంత్. ఎవరికి నచ్చినట్టు వారు రాస్తున్నారు. మా గురించి పట్టించుకోవడంలేదు. ఇటు మేము ఎంత బాధపడుతున్నామో వారికి అనౌవసరం అంటూ మండిపడ్డారు సీనియర్ హీరో. 
 

Hero Srikanth Comments Viral about Sosial Media JMS
Author
First Published Mar 24, 2023, 8:07 AM IST

ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సాధించుకున్నాడు  శ్రీకాంత్. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న ఈ హీరో.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. అటువంటి శ్రీకాంత్ పై లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన తన భార్య ఊహకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ న్యూస్ నెట్టింట గట్టిగా చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంలో అప్పుడు ఖండిస్తూ..ఓ నోట్ కూడా రిలీజ్ చేసిన శ్రీకాంత్.. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించారు. 


బర్త్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు శ్రీకాంత్.. 55 ఏళ్ళు వచ్చినా.. ఏమాత్రం తగ్గకుండా అదే గ్లామర్ మెయింటేన్ చేస్తున్నాడు ఫ్యామిలీ హీరో. ఇక తాజాగా సోషల్ మీడియా వదంతులపై మాట్లాడారు శ్రీకాంత్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాస్తున్నారు. ఆమధ్య నేను విడాకులు తీసుకున్నట్టు రాశారు. దాంతో అది నిజం కాదు అని చెప్పడానికి నాభార్య ఊహాను వెంట పెట్టుకుని పార్టీలు..ఫంక్షన్స్ కు వెళ్తున్నాను. తనకు సినిమా ఫంక్షన్స్ అన్నా... పార్టీలు అన్నా ఇష్టం ఉండదు. కాని బ్రతిమలాడి తీసుకెళ్ళాల్సి వస్తుంది. 

ఎవరికి నచ్చినట్టు వారు రాస్తున్నారు కాని.. మా బాధను అర్ధం చేసుకోవడంలేదు. రీసెంట్ గా నా ఫోటో పెట్టి నేను చనిపోయినట్టు రాశారు. అది చూసి మేము తట్టుకోగలం..కాని అమ్మవాళ్లు చూస్తే.. పరిస్థితి ఏంటి..? ఏదైనా జరగోచ్చు.. ఇవన్నీ రాసేవారు ఆలోచించరు. వారిపై యాక్షన్ తీసుకుందామన్నా.. ఉపయోగం ఉండదు. వారంతంట వారు మారాలి.. ఇలాంటి విషయాల్లో మా కష్టాలు కూడా అర్ధం చేసుకోవాలి అన్నారు శ్రీకాంత్. మరోవైపు రీసెంట్ గా  కోటా శ్రీనివాసరావుగారు పోయారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేశారు. నేను బ్రతికే ఉన్నాను అని ఆయనే చెప్పుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ఆ న్యూస్ చూసి నేను కూడా షాక్ అయ్యాను  అన్నారు శ్రీకాంత్.

ఇక శ్రీకాంత్ క్యారెక్టర్ రోల్స్ తో బిజీ అయిపోయారు. రీసెంట్ గా విజయ్ వారసుడు, సుధీర్ బాబుతో హంట్ సినిమాల్లో మెప్పించారు శ్రీకాంత్. ప్రస్తుతం రామ్ చరణ్ Rc15 తో పాటు NTR30 లో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు శ్రీకాంత్. అయితే ఈ పాత్రల్లో కూడా ఆయన చాలా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. హీరోగా చేసే ఛాన్స్ ఉన్నా.. ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ కే ఇష్టపడుతున్నారు శ్రీకాంత్. ఇక ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళంలో కూడా వరుస అవకాశాలు సాధిస్తున్నాడు ఫ్యామిలీ హీరో.  
 

Follow Us:
Download App:
  • android
  • ios