Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ ని కలసిన కొత్త పెళ్లి కొడుకు శర్వానంద్.. రిసెప్షన్ కి ఆహ్వానిస్తూ.. 

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల జైపూర్ లో జరిగిన వివాహ వేడుకలో ఓ ఇంటివాడయ్యాడు. రక్షిత రెడ్డితో శర్వానంద్ వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా శర్వానంద్, రక్షిత రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్ లో జూన్ 9న గ్రాండ్ గా జరగనుంది.

Hero Sharwanand meet CM KCR to invite his marriage reception dtr
Author
First Published Jun 8, 2023, 6:14 PM IST

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల జైపూర్ లో జరిగిన వివాహ వేడుకలో ఓ ఇంటివాడయ్యాడు. రక్షిత రెడ్డితో శర్వానంద్ వివాహం ఘనంగా జరిగింది. శర్వానంద్ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై ఆశీర్వదించారు. శర్వా బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పెళ్లి వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా శర్వానంద్, రక్షిత రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్ లో జూన్ 9న గ్రాండ్ గా జరగనుంది. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో కొత్త పెళ్ళికొడుకు శర్వా గెస్ట్ లని ఆహ్వానించే పనిలో పడ్డాడు. 

తాజాగా శర్వానంద్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలసి ఇన్విటేషన్ అందించారు. కాసేపు కేసీఆర్ తో శర్వా సరదాగా ముచ్చటించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Hero Sharwanand meet CM KCR to invite his marriage reception dtr

శర్వానంద్ రిసెప్షన్ కి అతిరథమహారధులు  హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసిన శర్వానంద్ 38 ఏళ్ల వయసులో ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. శర్వాని ఫాలో అవుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా వివాహానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నటి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జూన్ 9నే జరగనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. 

Hero Sharwanand meet CM KCR to invite his marriage reception dtr

ఇదిలా ఉండగా శర్వా సతీమణి రక్షిత రెడ్డి  అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ చేస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శర్వానంద్ కి రక్షితతో పరిచయం ఏర్పడిందట. అభిప్రాయాలు కలవడంతో ఫ్రెండ్ షిప్ మొదలుపెట్టి ప్రేమికులుగా మారారు. హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి. 

Follow Us:
Download App:
  • android
  • ios