Asianet News TeluguAsianet News Telugu

#Sita Ramam: క్లోజింగ్ కలెక్షన్స్ (వరల్డ్ వైడ్),ఇది రేర్ ఫీట్

హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి మెప్పించారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. 

Dulquer Salmaan Sita Ramam Worldwide Closing Collections
Author
First Published Sep 15, 2022, 8:49 AM IST


కొత్త తరహా క్యూట్  లవ్ స్టోరీ గా తెరకెక్కిన సీతారామం(Sita Ramam)సినిమా బ్లక్ బస్టర్ హిట్  అయిన సంగతి తెలిసిందే.  సినిమా రిలీజ్ రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. థియేటర్స్ కు సరైన కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోనూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో థియేటర్స్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది...క్లోజింగ్ కలెక్షన్స్ డిటేల్స్ చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ 40 కోట్లు సాధించింది. అలాగే సినిమా గ్రాస్ 90 కోట్లు వచ్చింది. దుల్కర్ కెరీర్ లో అది పెద్ద హిట్ అని చెప్తున్నారు. మహానటి, కురూప్ రెండు చిత్రాలు 85 కోట్లు లోపే ఆగిపోయాయి. ఇప్పటికి కూడా చాలా చోట్ల మినిమం రెవిన్యూతో  సినిమా ఆడుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ నలభై నుంచి యాభై శాతం వరకూ డ్రాప్ ఉంటోంది. వీకెండ్ లో బాగుంది. థియేటర్ రన్ దాదాపు పూర్తై ఓటిటిలోకి వచ్చాక కూడా డిస్ట్రిబ్యూటర్ షేర్ ...మరో రెండు..మూడు కోట్లు ఈ సినిమా రాబట్టుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఓవర్ సీస్ లో అయితే ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేసింది.  2.05 మిలియన్ గ్రాస్ వచ్చిందని సమాచారం. నార్త్ అమెరికా నుంచి 1.55  మిలియన్ వచ్చాయని చెప్తున్నారు.  ఇక బింబిసార అయితే దీంట్లో సగం మాత్రమే కలెక్ట్ చేసిన దూరంగా ఉండిపోయింది. అయితే తెలుగులో మొదట్లో మాత్రం బింబిసార కలెక్షన్ల పరంగా ముందంజలో ఉంది.  మరో ప్రక్క ఓవర్ సీస్ లో  కార్తికేయ 2 చిత్రం పుంజుకుని దూసుకుపోవటం విశేషం.  మధ్యలో వచ్చిన మాచర్ల, లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ అన్నీ కూడా చతికిలపడ్డాయి. బాక్సాఫీస్ ముందు ముందు వెలవెలబోయాయి. కార్తికేయ 2 సినిమాకు నార్త్‌లో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది
 
హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి మెప్పించారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అద్భుతమైన ప్రేమ కథలో దుల్కర్, మృణాల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విశాల్ చంద్ర సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. విడుదలైన అన్ని భాషల్లో సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios