'చిత్రలహరి' ఫస్ట్ డే కలెక్షన్స్!
మెగామేనల్లుడు సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం 'చిత్రలహరి'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది.
మెగామేనల్లుడు సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం 'చిత్రలహరి'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా రూ.3.08 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో వారాంతంలో ఈ సినిమా 8 నుండి 10 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ద్వారా రూ.11.05 కోట్ల వరకు జరిగింది. వారం రోజులు ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉంటే గనుక బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఏరియాల వారీగా కలెక్షన్లు..
నైజాం............................ రూ.86లక్షలు
సీడెడ్.............................. రూ.51లక్షలు
కృష్ణా................................ రూ.24లక్షలు
గుంటూరు........................ రూ.30లక్షలు
నెల్లూరు........................... రూ.14లక్షలు
వెస్ట్..................................... రూ.24లక్షలు
ఈస్ట్..................................... రూ.38లక్షలు
ఉత్తరాంధ్ర........................... రూ.41లక్షలు