Asianet News TeluguAsianet News Telugu

ఎంపీతో ప్రేమలో పడిన బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా..? వైరల్ అవుతున్నవీడియో.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమాయణాలు కామన్. కాకపోతే హీరోలు.. హీరోయిన్లు.. నటీనటులు మధ్య ప్రేమలు ఎప్పుడూ చూసేవే.. కాని హీరోయిన్.. పొలిటికల్ లీడర్లను ప్రేమించి పెళ్ళాడటం మాత్రం కాస్త వెరైటీ. ఈక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఓ ఎంపీతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 

Bollywood Heroine Parineeti Chopra Dating with MP Raghav Chadha JMS
Author
First Published Mar 24, 2023, 9:35 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. అందం అభినయంలో.. ఏ హీరోయిన్ కు తీసిపోదు పరిణితి. చూపు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. ఆ అందంతోనే  ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంటూ వెళ్తోంది బ్యూటీ.  ముఖ్యంగా యూత్ తో ఆమె అభిమానులు ఎక్కువగా ఉన్నారు. పరిణితి కూడా  అంతే హుషారుగా తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంటారు. తనకు సబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె దాదాపు గా అభిమానులకు శేర్ చేస్తుంటారు. కాని ఈ బ్యూటీ లవ్ లో పడ్డ విషయం మాత్రం బయటకు చెప్పలేదంటూ.. ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇంతకీ పరిణితి ప్రేమలో ఉందా..? 

ఈ మధ్య ముద్దుగుమ్మ పరిణితికి  సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పరిణీతి డేటింగ్​లో ఉన్నట్లు రూమర్స్ తెగ షికారు చేస్తున్నాయి. ఓ పోలిటికల్ లీడర్ తో ఆమె ప్రేమలో ఉందని ..కలిసి కార్లో  షికార్లు కూడా చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ కు కాస్త బలం చేర్చినట్టుగా.. రీసెంట్ గా .. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో ముంబైలో పరిణితి కనిపించింది. ఇద్దరు  కెమెరాల కంటికి చిక్కారు. సిటీలోని ఓ రెస్టారెంట్​ నుంచి బయటకు వస్తుండగా వీళ్లిద్దరూ మీడియాకు దొరికిపోయారు. 

అప్పటి వరకూ కాస్త డౌట్ గా ప్రచారం జరగ్గా.. వీరిద్దరు  కెమెరాల కంటికి చిక్కిన తరువాత.. ఇక డేటింగ్ రూమర్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాని ఈ విషయంలో ఇద్దరిలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో ఎంత నిజం ఉందనేది పరిణీతి, రాఘవల్లో ఎవరు ఒకరు క్లారిటీ ఇచ్చే దాకా తెలియదు. ఒక వేళ బెస్ట్ ఫ్రెండ్స్ గా రెస్టారెంట్ కు వెళ్లారా..? లేక డేటింగ్ లో భాగంగా వెళ్లారా అనేది వాళ్లు స్పందిస్తేనే తెలుస్తుంది. 

ఇక  పరిణీతి విషయానికి వస్తే.. 2011లో లేడీస్ వర్సెస్ రికీ భల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టడంతో పాటు  ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇషక్​ జాదేతో మంచి హిట్​ను ఖాతాలో వేసుకుంది పరిణితీ చోప్రా.  ఈ సినిమాతో పరిణితికి యూత్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  కానీ ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా ప్లాప్ లు పలుకరించాయి. ఆమె ఏ సినిమా చేసినా..  ఆడలేదు. గత కొన్నేళ్లలో పరిణీతి సాలిడ్ హిట్ కొట్టలేకపోయింది. 

ఇక రీసెంట్ గా పరిణితి చోప్రాకు కేసరి సినిమా  రూపంలో మంచి సక్సెస్ లభించింది. కానీ ఈ మూవీ క్రెడిట్ కూడా​ హీరో అక్షయ్ కుమార్​ ఖాతాలోకి వెళ్లిపోయింది.కేసరిలో అక్షయ్ నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి.  దాంతో పరిణితి కెరీర్ ఇబ్బందుల్లో ఉంది అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ కోడ్ నేమ్: తిరంగా సినిమాతో ఆడియెన్స్​ను పలకరించారు పరిణీతి. కానీ ఈ సినిమా కూడా పరిణితికి సక్సెస్ ఇవ్వలేకపోయింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios