Asianet News TeluguAsianet News Telugu

వార్ 2 రిలీజ్ డేట్ లాక్ చేసిన టీమ్... ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. వార్ 2 విడుదల తేదీ ప్రకటించారు నిర్మాతలు. 
 

big update to ntr fans war 2 release date locked ksr
Author
First Published Nov 29, 2023, 1:20 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు ఎన్టీఆర్. ఏకంగా ఆస్కార్ వేడుకలో పాల్గొన్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ క్రేజ్ ఇండియా వైడ్ విస్తరించగా బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ కూడా భాగం అయ్యాడు. ఆయన వార్ 2లో నటిస్తున్నారు. 

యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై ఫ్రాంచైజీలో టైగర్, ఏక్తా టైగర్, టైగర్ జిందాహై, పఠాన్, టైగర్ 3 చిత్రాలు తెరకెక్కాయి. 6వ చిత్రంగా వార్ 2 నిర్మిస్తున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లు సమాచారం. విదేశాల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించారు. టైగర్ 3లో వార్ 2కి సంబంధించిన హింట్స్ ఇచ్చారు. 

కాగా నేడు వార్ 2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. వార్ 2 నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వార్ 2 విడుదల తేదీ అప్డేట్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఎన్టీఆర్ కి చాలా ప్రత్యేకం. ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ చిత్రం కావడంతో పాటు, పూర్తి స్థాయి స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. 

మరోవైపు ఆయన దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వాదన ఉంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

దేవర విడుదలైన ఏడాదికి ఎన్టీఆర్ వార్ 2తో ఫ్యాన్స్ ని పలకరించనున్నాడు. అలాగే కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. వార్ 2 తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవు. ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదు.  

మార్కెట్ లోకి #Salaar షర్ట్స్, రేటు ఎంతంటే...
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios