Asianet News TeluguAsianet News Telugu

గ్రాండ్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 , కీలక ప్రకటన చేసిన బాలకృష్ణ

మరోసారి  హోస్ట్ గా సందడి చేయబోతున్నారు బాలయ్య బాబు. అన్ స్టాపబుల్ అంటూ సెకండ్ సీజన్ కు  రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా సెకండ్ సీజన్ కు సబంధించి ఈవెంట్ ను గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు బాలయ్య. 
 

balakrishna Special annowncment about unstoppable season2
Author
First Published Oct 5, 2022, 3:13 PM IST

మరోసారి  హోస్ట్ గా సందడి చేయబోతున్నారు బాలయ్య బాబు. అన్ స్టాపబుల్ అంటూ సెకండ్ సీజన్ కు  రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా సెకండ్ సీజన్ కు సబంధించి ఈవెంట్ ను గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు బాలయ్య. 

బాలయ్య బాబు హోస్ట్ గా మారి చేసి మొట్టమొదటి షో అన్ స్టాపబుల్. ఈ సెలబ్రిటీ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ షోతో అటు అభిమానులతో పాటు.. ఆడియన్స్ అందరిని అలరించాడు బాలయ్య. అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ ఈ షో తెగ నచ్చేసింది. సినీ స్టార్ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్లందరితో సరదగా షోని తనదైన శైలిలో నడిపించారు బాలకృష్ణ. 

ఇక అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ తో సెకండ్ సీజన్ ను అంతకు మించి అన్నట్టు ప్లాన్ చేశారు టీమ్. ఈసారి సినిమా వాళ్లతో పాటు పొలిటికల్ గా బాగాపేమస్ లీడర్లను కూడా ఈ షోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అందరూ అనుకున్నట్టుగానే అందరూ అనుకున్నట్టే మరోసారి బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని కూడా ప్రకటించారు.

ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కూడా అయింది. ఫస్ట్ ఎపిసోడ్ ను తెలుగు దేశం అ ఈ సారి సినీ సెలబ్రిటీలతోనే కాక రాజకీయ నాయకులని కూడా తీసుకొస్తున్నారు. ఈ షో కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడలో ప్రత్యేకంగా ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.

ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 2 లాంచింగ్ ఈవెంట్లో బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఇక ఈ షోకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వస్తారా అని మీడియా వారు అడిగిన  ప్రశ్నకి బదులిస్తూ.. వాళ్లంతా రావొచ్చు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నారు. అది ఆహా వారు ప్లాన్ చేస్తారని అని అన్నారు. 

బాలకృష్ణ మాట్లాడుతూ రీసెంట్ గా ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళు టీవీలు, ఓటీటీకి వస్తున్నారు, మీరెప్పుడు వస్తారు అని అభిమానులు నన్ను కూడా అడగడంతో అభిమానుల కోసమే ఈ షో చేశాను అన్నారు. అనుకున్నట్టుగానే అభిమానులు ఆదరించారు.. అందుకే మరో సీజన్ తో మీ ముందుకు వస్తున్నా అన్నారు  బాలయ్య. 

Follow Us:
Download App:
  • android
  • ios