Asianet News TeluguAsianet News Telugu

సీతా రామంతో '18 పేజెస్' కి పోలిక.. నా కెరీర్ లోనే 2022 బెస్ట్ ఇయర్, నిఖిల్ కామెంట్స్

కార్తికేయ 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జోడి జంటగా నటించిన మరో చిత్రం 18 పేజెస్. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించే టాక్ సొంతం చేసుకుంది.

Allu Aravind compares 18 pages with Sita ramam movie
Author
First Published Dec 29, 2022, 8:20 PM IST

కార్తికేయ 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జోడి జంటగా నటించిన మరో చిత్రం 18 పేజెస్. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించే టాక్ సొంతం చేసుకుంది. నిఖిల్, అనుపమ నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో బన్నీ వాసు, అల్లు అరవింద్, నిఖిల్, అనుపమ, దర్శకుడు సూర్య ప్రతాప్ పాల్గొన్నారు. అనుపమ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు చేసినప్పుడు మనకు కిక్ వస్తుంది. కానీ 18 పేజెస్ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు సంతృప్తినిచ్చింది. ఒక యాక్టర్ గా చాలా మంచి సినిమా చేసిన ఫీల్ వచ్చింది. శతమానం భవతి నిత్యా కేరక్టర్ కి ఎలా పేరు వచ్చిందో ఇప్పుడు కూడా అలానే ఉంది అని తెలిపింది. 

అల్లు అరవింద్ కూడా సక్సెస్ మీట్ లో మాట్లాడారు. ఫీల్ గుడ్ సినిమా ఆడదు, లవ్ స్టోరీస్ ఇంటికొస్తాయి అవి చూసుకుంటాం ఇలా అనుకున్న తరుణంలో సీతారామం సినిమా వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లైమాక్స్ కి ఉన్న ఫీలింగ్ ఈ సినిమాకి వచ్చిందని చాలామంది పోల్చి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. నిఖిల్ ఇంకో రెండు సినిమాలు మా బ్యానర్ లో చేయమని అడిగాం, దానికి తాను ఇంకా ఒప్పుకోలేదు అని సరాదాగా అన్నారు. 

థాంక్యూ మీడియా, సినిమా రిలీజై వారం రోజులు అవుతుంది, నేను న్యూస్ పేపర్స్ బుక్ మై షో చూస్తుంటే మొదటిరోజు ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అంతకుమించిన థియేటర్స్ ఉన్నాయ్ కొన్ని చోట్ల, ఇది ఒక బిగ్ అచివ్మెంట్. 18 పేజెస్ సినిమా ఒక స్లో పాయిజన్ అండి. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది. ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అనుకున్నాను, కానీ నిజంగా ఈరోజు సప్రైజ్ అవుతున్నాను, ఒక మంచి కథను బ్యూటిఫుల్ గా చెప్తే సినిమా చాలా బాగుంటుంది. ఇది మాస్ ఎంటెర్టైమెంట్ కాదు, సిచ్యువేషన్స్ తో వెళ్తున్న కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా క్లైమాక్స్ ను మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి అని నిఖిల్ అన్నారు. ఈ చిత్రంలో నిఖిల్, అనుపమ నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios