Asianet News TeluguAsianet News Telugu

Ajith : ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్న తమిళ స్టార్ హీరో అజిత్..? అంత నమ్మకమేంటి బాసు..

కోలీవుడ్ లో స్టార్ సీనియర్ హీరో అజిత్(Ajith) క్రేజ్ తెలియంది కాదు. ప్రస్తుతం వాలిమై హడావిడిలో ఉన్న అజిత్.. ఇదే డైరెక్టర్ తో మరో మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Ajith New Movie Update
Author
Hyderabad, First Published Jan 23, 2022, 11:44 AM IST

కోలీవుడ్ లో స్టార్ సీనియర్ హీరో అజిత్(Ajith) క్రేజ్ తెలియంది కాదు. ప్రస్తుతం వాలిమై హడావిడిలో ఉన్న అజిత్.. ఇదే డైరెక్టర్ తో మరో మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

తమిళ స్టార్ హీరో అజిత్(Ajith)  కు గురి కుదిరితే వదిలిపెట్టడు. ఆయనకు నచ్చాలే కాలి.. ఎంత చిన్న డైరెక్టర్ అయినా.. అవకాశాలు ఇచ్చుకుంటూ పోతాడు. ప్రస్తుతం స్టార్ హీరో అదే పని చేస్తున్నాడు. తనకు నచ్చేలా.. తన ఫ్యాన్స్ మెచ్చేలా సినిమాలు అందిస్తున్నాడు అని ఫీల్ అయ్యాడో ఏమో.. డైరెక్టర్ వినోద్ కు వరుస గా ఆఫర్లు అందిస్తున్నాడు అజిత్(Ajith).  వీరిద్దరి కాబినేషన్ లో ఫస్ట్ నెర్కొండ ఫార్వాయి మూవీ వచ్చింది. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈసినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

 అజిత్ (Ajith) కు ఈ మూవీతో  కొత్త ఇమేజ్ ఆడ్ అయ్యింది. ఇక ఆ దెబ్బతో డైరెక్టర్ వినోద్ పై అజిత్ కు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. వెంటనే ఆలోచించకుండా వాలిమైను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేశాడు అజిత్(Ajith). అయితే  వీరి కాంబోలో ఫస్ట్ మూవీ నెర్కొండ పార్వాయితో పాటు ప్రస్తుతం చేస్తున్న వాలిమైని కూడా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇక వాలిమై అన్ని కార్యక్రమాలు పూర్తి చేసకుని రిలీజ్ కు రెడీగా ఉంది. మధ్యలో కరోనా అడ్డు రాకుండా ఉంటే.. సంక్రాంతికి రిలీజ్ అయిపోయేది.

ఇప్పుడు సమ్మర్ వైపు చూస్తుంది ఈ మూవీ. సమ్మర్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు అజిత్. అందుకే వినోద్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలస్తోంది. వరుసగా హ్యాట్రీక్ మూవీ.. అది కూడా గ్యాప్ లేకుండా ఇచ్చేస్తున్నాడు అజిత్(Ajith). వాలిమైతో పాటు వచ్చే కొత్త సినిమా కూడా సక్సెస్ సాధిస్తే.. వీరిద్దరి కాంబినేషన్ సరకొత్త రికార్ట్స్ ను క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.

అయితే  వీరి హ్యాట్రిక్ సినిమా గురించి ఇప్పటి వరకూ అఫీషయల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న వాలిమై సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీలో అజిత్(Ajith)  కు ఆపోజిల్ రోల్ లో తెలుగు యంగ్ స్టార్ హీరో కార్తికేయ(Karthikeya) నటించాడు. దాంతో తెలుగులో కూడా ఈమూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలకు బలం అని తెలుగు టైటిల్ పెట్టాలని అనుకుని వెనక్కి తగ్గారు టీమ్. వాలిమై టైటిల్ తోనే సమ్మర్ లో సినిమా రిలీజ్ కాబోతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios