బాలీవుడ్ బ్యూటీ బాంబ్ కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పింది... ఎందుకు చెప్పింది...? ఎవరికి చెప్పింది. ఫైర్ బ్రాండ్ సారీ చెప్పడానికి కరాణం ఏంటీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయిన విషయం ఇది. అసలు కంగనా ఎందుక సారి చెప్పింది.
బాలీవుడ్ బ్యూటీ బాంబ్ కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పింది... ఎందుకు చెప్పింది...? ఎవరికి చెప్పింది. ఫైర్ బ్రాండ్ సారీ చెప్పడానికి కరాణం ఏంటీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయిన విషయం ఇది. అసలు కంగనా ఎందుక సారి చెప్పింది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో.. అందులోను బాలీవుడ్ లో వినిపించే పేరే కంగనా రనౌత్. కాంట్రవర్సీలు వెత్తుకుంటూ వెళ్తుంది బ్యూటీ. ఎవరికీ భయపడకుండా ఉన్నద్ది ఉన్నట్టు మాట్లాడంలో లో ఆమెను మించి ఎవరూ లేదు. అంతే కాదు పాలిటిక్స్ లో కూడా వేలు పెట్టి.. విమర్షలను ధైర్యంగా ఎదుర్కొంటుంది కంగనా రనౌత్. ఆమె ఏదైనా పోస్ట్ పెట్టిందంటే.. అది నిమిషాల్లోనే వేలు, లక్షల్లో వ్యూస్ సాధిస్తుంటుంది. ఇక ఈక్రమంలో కంగనా రీసెంట్ గా చేసిన పోస్ట్ అందరిని ఆశ్చర్యంలోముంచెత్తుతుంది.
బాలీవుడ్ లో ఓ వింత జరిగింది. బాలీవుడ్ బ్యూటీ బాంబ్.. కాంట్రవర్సీల క్వీన్ .. హీరోయిన్ కంగనా రనౌత్ క్షమాపణలు కోరింది. అదికూడా తన పుట్టిన రోజున నన్ను క్షమించడండీ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది కంగనా. గురువారం తన 36వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది కంగనా. ఈ సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో.. వీడియో పంచుకున్నారు కంగనా. అయితే తాను క్షమాపణలు చెప్పింది ఎవరికో కాదు..నెటిజన్లకు. అది కూడా తనను అభిమానించే వారు, అనుసరించే వారు, ద్వేషించే వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ లు చేశారు కంగనా.
చీరలో ధగధగ మెరిసిపోయింది కంగనా రనౌత్. గులాబీ రంగు అంచుతో.. ఆకుపచ్చ చీరదలో కంగనా సందడి చేసింది. అంతే కాదు బంగారు నగలతో మెరుపులు మెరిపించిన బాలీవుడ్ క్వీన్.. తనకు మద్దతుగా నిలిచిన తన తల్లిదండ్రులు, తనకు బోధించిన గురువులకు ధన్యవాదాలు తెలిపింది. ఆ తరువాత తనను ద్వేషించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలని కంగనా రనౌత్ కోరింది. కంగనా పెట్టిన ఈ విచత్రపు పోస్ట్ కు.. అంతా షాక్ అవుతున్నారు.
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా శత్రువులు నన్ను విశ్రాంతి కూడా తీసుకోనివ్వకుండా చేశారు. నేను ఎంత సక్సెస్ అయ్యాను అన్నది కాదు ముఖ్యం. నన్ను నా పాదాలపై నిలుచుని, విజయ పథంలో నడిచేలా చేశారు. ఎలా పోరాడాలో నేర్పించారు. వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అని కంగనౌ రనౌత్ పోస్ట్ చేయడం గమనార్హం. ఇక తన ఫ్రెండ్స్ గురించి కూడా కామెంట్ చేసింది బ్యూటీ... స్నేహితులారా నా సిద్ధాంతం చాలా సులభం. నా ప్రవర్తన, ఆలోచనలు చాలా సాధారణం. అందరికీ మంచి జరగాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశ సంక్షేమం కోసం మాట్లాడుతూ నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే అలాంటి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని రాసుకొచ్చింది కంగనా రనౌత్.
