తమిళనాడులో పైరసీ వెబ్ సైట్ తమిళరాకర్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారింది. పైరసీ కాకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఈ వెబ్ సైట్ ఆగడాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన 'సర్కార్' సినిమాని కూడా పైరసీ చేస్తామని ముందే బెదిరించి ఆన్ లైన్ లో హెచ్ డి ప్రింట్ సినిమాను పెట్టేశారు.

ఇక అమీర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా రిలీజ్ రోజే మూడు భాషల్లో పైరసీ ప్రింట్ ని ఆన్ లైన్ లో అప్లోడ్ చేసేశారు. ఇప్పుడు ఈ పైరసీ వెబ్ సైట్ ఏకంగా '2.0' మేకర్స్ కి సవాల్ విసురుతోంది. తమిళ రాకర్స్ సైట్ లో త్వరలోనే '2.0' రాబోతుంది అంటూ ఈ పైరసీ వెబ్ సైట్ నిర్వాహకులు ట్వీట్ చేశారు.

రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను ఇప్పుడు పైరసీ చేస్తామని ముందే వార్నింగ్ ఇవ్వడం చిత్రబృందంలో ఆందోళన మొదలైంది. తమిళరాకర్స్ చెప్పిందే గనుక చేస్తే ఈ సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా.. అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు