Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక హత్య: ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదంటే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రియాంక రెడ్డి తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నలుగురు దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Director Sukumar Sensational comments on Priyanka Reddy Murder
Author
Hyderabad, First Published Dec 1, 2019, 4:51 PM IST

వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రియాంక రెడ్డి తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నలుగురు దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన తర్వాత అత్యంత దారుణంగా ఆమెని సజీవ దహనం చేశారు. 

ఈ పాశవిక ఘటనని ఖండిస్తూ దేశం మొత్తం గళమెత్తుతోంది. దోషులని ఉరితీసి ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. జాతీయ మీడియా సైతం ఈ ఘటనపై ఫోకస్ చేస్తోంది. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా గళం విప్పుతూ ఇండియాలో చట్టాలు కఠినతరం అవ్వాలని.. అప్పుడే ఇలాంటి ఘటనలు ఆగుతాయని కోరుకుంటున్నారు. 

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియాంక హత్య ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమానికిఅతిథిగా హాజరైన సుకుమార్ ప్రియాంక హత్య సంఘటనపై స్పందించారు. 

సుకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధని కలిగిస్తున్నాయి. ప్రియాంకని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఎవరికైనా కన్నీరు ఆగవు. సంబంధంలేని వారు కూడా ప్రియాంక సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . 

ప్రియాంక హత్య: మీరు ఆ పని చేయాల్సిందే.. మోడీ, కేటీఆర్ కు మహేష్ బాబు రిక్వస్ట్!

ప్రస్తుతం ఉన్న సమాజాన్ని చూస్తుంటే.. పిల్లలని ఎలా పెంచాలనే భయం వేస్తోంది. క్రిమినల్స్ అందరూ మనలో నుంచే వస్తారు. ఈ సంఘటనకు మనం కూడా ఓ రకంగా భాద్యులమే. మొబైల్, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా పోర్న్ సైట్స్ ఎక్కువైపోయాయి. గతంలో సమాజం ఇంత దారుణంగా లేదు. 

ప్రియాంక హత్య: వాళ్ళని చంపి జైలుకెళతా.. సిగ్గులేదురా మీకు.. కన్నీరు మున్నీరైన పూనమ్ కౌర్!

ప్రియాంక కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రియాంక 100కి కాల్ చేసి ఉంటే బావుండేది అని అంటున్నారు. నేను కూడా దీని గురించి ఆలోచించా. ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదు అని ఆలోచించగా.. ప్రియాంక మాటలు వింటే చాలా సున్నితమైన అమ్మాయి అని తెలుస్తోంది. 

దోషులు మొదట ఆమెకు సాయం చేస్తామని నమ్మించారు. ఒక వేళ నేను 100కి కాల్ చేస్తే.. వాళ్ళు నిజంగానే నాకు సాయం చేసే మనసుతో ఉన్నారేమో.. నీకు సాయం చేయడానికి వస్తే పోలీసులకు అప్పగించావేంటి అని అంటారేమో.. అని ఆ సమయంలో ప్రియాంక అనుకొని ఉంటుంది. 

ప్రియాంక హత్య: మృగాల మధ్య బతుకుతున్నాం.. అమ్మాయిలకు చిరంజీవి రిక్వస్ట్!

అమ్మాయిలు.. అబ్బాయిలని ఏదో ఒక సమయంలో నమ్మేస్తారు. మేము మగాళ్ళం కాదు మృగాలం. దయచేసి అమ్మాయిలు ఎవరూ అబ్బాయిలని నమ్మకండి. సొంత తండ్రి, అన్న, తమ్ముడిని కూడా నమ్మొద్దు. ప్రస్తుతం సమాజం అలా ఉంది. 100కి కాల్ చేయాలని అనిపిస్తే చేసేయండి.. తర్వాత సారీ చెప్పొచ్చు. మీరు మమ్మల్ని నమ్మకపోవడమే బెటర్ అని సుకుమార్ వేదికపై వ్యాఖ్యానించారు. 

ప్రియాంక హత్య: ఈ జంతువులని ఇలా చేయండి.. చట్టానికి వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూచన!

ప్రియాంక రెడ్డి హత్య: 'ఒక్క తీర్పు' అంటూ హీరో రామ్ ఎమోషనల్ కామెంట్స్!

Follow Us:
Download App:
  • android
  • ios