వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య సంఘటన కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. మృగాల్లాగా ప్రవర్తించిన దోషులు నలుగురికి మరణశిక్ష విధించాలని సమాజం మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటోంది. బుధవారం రాత్రి శంషాబాద్ ప్రాంతంలో ప్రియాంక రెడ్డిని ఒంటరిగా గమనించిన నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

ఆపై అత్యంత కిరాతకంగా ప్రియాంకని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు.  మహిళా సంఘాలు, సెలెబ్రిటీలు,ప్రజలు అంతా ఏకమై బాధితురాలి ఆత్మ శాంతించేలా, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా దోషులని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ప్రియాంక ఆ నలుగురిని చూసిన సమయంలోనే.. వారిని చూస్తే అనుమానం కలుగుతోంది.. భయం వేస్తోంది అంటూ తన చెల్లెలికి ఫోన్ చేసింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ అమ్మాయిలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే 100కు డయల్ చేయాలనీ అంటున్నారు. సెలెబ్రిటీలు కూడా ఇదే అవేర్నెస్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా చిరంజీవి ప్రియాంక హత్య ఘటన గురించి ఎమోషనల్ గా స్పందించారు. ప్రియాంక హత్య ఘటన, మరికొన్ని సంఘటనలు చూస్తుంటే ఈ దేశంలో అమ్మాయిలకు భద్రత లేదా అనే భావన కలుగుతోంది. మానవ మృగాల మధ్య మనం బతుకుతున్నాం అని అనిపిస్తోంది. మనసుని కలచివేసిన ఏఈ సంఘటన గురించి ఒక అన్నగా.. తండ్రిగా స్పందిస్తున్నాను. 

ఇలాంటి దుర్మార్గులకు శిక్షలు.. కఠినంగా ఉండాలి.. భయం కలిగించేలా ఉండాలి.. నడిరోడ్డు మీద ఉరితీసినా తప్పులేదు. పోలీసులు నేరస్తుల్ని త్వరగా పట్టుకున్నారు. అలాగే వారికీ త్వరగా శిక్ష అమలు చేయాలి. ఆడపిల్లలకు నేను ఓ విషయం చెబుతున్నా. 

మీరు ఫోన్ లో 100 నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే హాక్ ఐ ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. పోలీసులు, షీటీమ్స్ సేవలని వినియోగించుకోండి అని చిరు అమ్మాయిలని రిక్వస్ట్ చేశారు.