ప్రియాంక హత్య ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని, దోషుల్ని ఉరితీయాలని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు హైదరాబాద్ లో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఈ అంశం పెను దుమారం రేపుతోంది. 

నలుగురు నిందితులు అత్యంత పాశవికంగా ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి ఆమెని సజీవ దహనం చ్చేసిన సంఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఈ ఘటనపై సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రియాంక హత్య: వాళ్ళని చంపి జైలుకెళతా.. సిగ్గులేదురా మీకు.. కన్నీరు మున్నీరైన పూనమ్ కౌర్!

తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రియాంక హత్య ఘటన గురించి స్పందించాడు. బాధితురాలి కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా. మీ ఆవేదన వర్ణించలేనిది. అందరం కలసి మహిళలకు, యువతులకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలి. ఇండియాని మహిళలకు సేఫ్ ప్లేస్ గా మార్చాలి. 

ప్రియాంక హత్య: మృగాల మధ్య బతుకుతున్నాం.. అమ్మాయిలకు చిరంజీవి రిక్వస్ట్!

రోజులు గడుస్తున్నాయి.. నెలలు గడుస్తున్నాయి.. సంవత్సరాలు గడుస్తున్నాయి .. ఏం మారలేదు.. ఒక సమాజంగా మనందరం విఫలమయ్యాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నా వ్యక్తిగతంగా ఓ రిక్వస్ట్ చేస్తున్నా. కేటీఆర్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడున్న చట్టాలని మార్చి కఠినతరం చేయండి. ఇలాంటి దారుణాలని అడ్డుకోగలిగే శిక్షలని అమలు చేయండి అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. 

ప్రియాంక రెడ్డి హత్య: 'ఒక్క తీర్పు' అంటూ హీరో రామ్ ఎమోషనల్ కామెంట్స్!

ఇప్పటికే చిరంజీవి, అనుష్క, కీర్తి సురేష్, వరుణ్ తేజ్, నిఖిల్, పూనమ్ కౌర్, విరాట్ కోహ్లీ లాంటి సెలెబ్రిటీలంతా ప్రియాంక హత్య ఘటనపై గళం విప్పారు.