రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు ఓ గిప్ట్ ఇచ్చాడు. ఇంతకీ విజయ్ ఇచ్చిన ఆ బహుమతి ఏంటి? అసలు అనిరుధ్ కు రౌడీ హీరో ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడంటే?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు ఓ గిప్ట్ ఇచ్చాడు. ఇంతకీ విజయ్ ఇచ్చిన ఆ భహుమతి ఏంటి? అసలు నిరుధ్ కు రౌడీ హీకరో ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడంటే?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్డమ్’ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ కు చాలా ముఖ్యం. కెరీర్ లో రౌడీ హీరో కాస్త గట్టిగా నిలబడాలంటే ఈసినిమా హిట్ అవ్వాల్సిందే. గతంలో వచ్చిన వరుస ఫ్లాపుల తర్వాత విజయ్‌కు ఇది మళ్లీ గెలుపు దారి చూపే అవకాశం కావడంతో, సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్రేక్షకుల నుండి విశేష స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, అనిరుధ్‌కు ప్రత్యేక బహుమతి ఇచ్చి మరింత అనుబంధాన్ని చాటుకున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో, విజయ్ తన రౌడీ బ్రాండ్ టీ షర్ట్ తో పాటు.. షటిల్ బ్యాట్‌ను అనిరుధ్‌కు అందజేశారు. వీడియోలో ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుతూ, సంగీతం, సినిమా గురించి చర్చించుకుంటూ కనిపించారు. ఆతరువాత అనిరుధ్ విజయ్ ఇచ్చిన టీ షర్ట్ వేసుకుని, కెమెరా ముందుకు వచ్చారు. అంతా కలిసి షటిల్ ఆడటానికి రెడీ అయ్యారు. ఆ లుక్‌లో అనిరుధ్ స్టైలిష్‌గా కనిపించగా, అభిమానులు ఈ వీడియో వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో వదిలారు. ఈ వీడియోతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ‘కింగ్డమ్’ సినిమాను జులై 4, 2025న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, అనిరుధ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కింగ్ డమ్ సినిమాలో విజయ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారని సమాచారం. తాజా వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్, పోస్టర్లు, మ్యూజిక్ మొదలైనవి ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తుండగా, జులై 4న విడుదల కాబోతున్న ఈ సినిమా విజయ్ అభిమానులకు భారీ పండుగలా మారనుంది.