ప్రియాంక రెడ్డి హత్య సంఘటన దేశం మొత్తం సంచలనంగా మారుతోంది. ప్రియాంక రెడ్డిపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమెని శంషాబాద్ సమీపంలో సజీవ దహనం చేశారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. నేడు పోలీసులు ప్రియాంక రెడ్డి హత్య కేసులో అనుమానితులుగా ఉన్న కొందరిని అరెస్ట్ చేశారు. 

తెలంగాణ హోమ్ మంత్రి, పోలీస్ శాఖ మొత్తం ఈ కేసుపైనే ఫోకస్ పెట్టారు. మహిళల లోకం భగ్గుమంటోంది. సెలెబ్రిటీలంతా ప్రియాంక రెడ్డికి సంతాపం తెలియజేస్తూ.. ఈ సంఘటనని ఖండిస్తూ సినీ రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, కీర్తి సురేష్, కార్తికేయ లాంటి నటులంతా ప్రియాంక హత్యపై స్పందించారు. 

తాజాగా హీరో రామ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ప్రియాంక హత్య ఘటనపై తనెంత ఆగ్రహంతో ఉన్నాననే విషయాన్ని రామ్ ట్వీట్ ద్వారా తెలిపాడు. 

'భయం.. ఇలాంటి ఆలోచన వస్తే భయం వేసేలా ఒక్క తీర్పు.. అప్పటిదాకా వీళ్ళలో రాదు మార్పు' అని రామ్ ట్వీట్ చేశాడు. 

ఇకపై దారుణమైన చర్యకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా భయాన్ని కలిగించేలా నిందితులకు ఖఠినమైన శిక్ష విధించాలని అర్థం వచ్చేలా రామ్ ఈ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. 

'సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం..?' ప్రియాంకా హత్యపై హీరో కార్తికేయ కామెంట్స్!

అమ్మాయిగా పుట్టడం నేరమా..? ప్రియాంకా హత్యపై అనుష్క ఆవేదన!