Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక హత్య: వాళ్ళని చంపి జైలుకెళతా.. సిగ్గులేదురా మీకు.. కన్నీరు మున్నీరైన పూనమ్ కౌర్!

గత మూడు రోజులుగా ప్రియాంక హత్య ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదుపునకు గురిచేస్తోంది. బుధవారం రోజు రాత్రి వైద్యురాలు ప్రియాంకని నలుగురు దుండగులు అత్యాచారం చేసి, సజీవదహనం చేసిన సంఘటన ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది.

Heroine Poonam kaur emotional burst on Priyanka Reddy Murder
Author
Hyderabad, First Published Dec 1, 2019, 11:16 AM IST

గత మూడు రోజులుగా ప్రియాంక హత్య ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదుపునకు గురిచేస్తోంది. బుధవారం రోజు రాత్రి వైద్యురాలు ప్రియాంకని నలుగురు దుండగులు అత్యాచారం చేసి, సజీవదహనం చేసిన సంఘటన ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. దేశం మొత్తం ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరేలా ఆ నలుగురిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. 

మహిళా సంఘాలు, రాజకీయ ప్రముఖులు, సెలెబ్రిటీలు ఈ ఘటనని ఖండిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సమకాలీన అంశాలపై తరచుగా స్పందించే నటి పూనమ్ కౌర్.. ప్రియాంక హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె ప్రియాంక రెడ్డి హత్యని ఖండించారు. 

ప్రియాంక హత్య: మృగాల మధ్య బతుకుతున్నాం.. అమ్మాయిలకు చిరంజీవి రిక్వస్ట్!

మరోసారి పూనమ్ కౌర్ తన దుఃఖాన్ని ఆపుకోలేక వీడియో రూపంలో స్పందించారు. ప్రియాంక హత్యఘటనపై పూనమ్ తన ఆవేదనని, ఆగ్రహాన్ని ఈ వీడియోలో వ్యక్తం చేశారు. ఓ వైపు కన్నీటిపర్యంతమవుతూనే దోషులపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ప్రియాంక రెడ్డి హత్య: నరేంద్ర మోడీకి హీరో నిఖిల్ రిక్వస్ట్.. అదొక్కటే మార్గం అంటూ..

తమ బిడ్ద కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళితే.. మీ కుమార్తె లేచిపోయిందేమో అని అన్నారట.. ఆ మాట అనడానికి మీకు సిగ్గులేదా అని పూనమ్ కౌర్ విరుచుకుపడింది. ఇక ఓ అమ్మాయిని వంచించి దారుణంగా అత్యాచారం, హత్య చేసిన ఈ జంతువులని శిక్షించకుండా కేసులు, కోర్టులు అంటూ కాలయాపన చేస్తున్నారు. 

నేను సహనం కోల్పోయాను. వాళ్ళని నేనే చంపాలని అనుకుంటున్నా.. జైలుకు వెళ్లినా పర్వాలేదు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం భరించాలి. దయచేసి దీనిని రాజకీయంగా వాడుకోవద్దు. అడివిలో జంతువులైనా నయం.. మీ బుర్రలకు ఏమైందిరా.. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా.. గత మూడురోజుల నుంచి నేను కనీసం కూర్చోలేకున్నా. 

ప్రియాంక హత్య: ఈ జంతువులని ఇలా చేయండి.. చట్టానికి వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూచన!

ఇలాంటి దారుణమైన సంఘటనలకు ముగింపు పలికేలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కండి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కాదు అని పూనమ్ కౌర్ విలపిస్తూ ప్రజలకు విజ్ఞాప్తి చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios