Asianet News TeluguAsianet News Telugu

లంబోర్ఘిని కొత్త సూపర్‌కార్.. కొత్త లుక్ లో బెస్ట్ డ్రైవింగ్ కోసం మొదటి స్పోర్ట్స్ కారు... చూసారా..

కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం, హురాకాన్ బేస్ మోడల్ స్టెరాటోను అప్‌డేట్ చేసింది. ఫ్రంట్ బంపర్‌కి కొత్త లుక్ ఇచ్చింది. అంతేకాకుండా  ఈ కార్ సాధారణ హురాకాన్ కంటే హై ఉంటుంది.
 

Lamborghini introduced the new supercar Huracan Sterato, know its features
Author
First Published Nov 16, 2022, 4:58 PM IST

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని కొత్త స్పోర్ట్స్ కార్ హురాకాన్ స్టెరాటో డిజైన్‌ను ఆవిష్కరించింది. నవంబర్ 30న అమెరికాలోని మియామీలోని ఆర్ట్ బాసెల్‌లో ఈ కారును అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

లుక్ ఎలా ఉంటుందంటే
కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం, హురాకాన్ బేస్ మోడల్ స్టెరాటోను అప్‌డేట్ చేసింది. ఫ్రంట్ బంపర్‌కి కొత్త లుక్ ఇచ్చింది. బానెట్‌పై LED లైట్ బార్, మందపాటి క్లాడింగ్, రగ్గడ్ ఫెండర్స్ ఫ్లేర్స్‌తో పాటు 3D ప్రింట్‌తో కొత్త లుక్ పొందుతుంది. ఈ కారు పూర్తిగా బ్లాక్ వీల్స్ అండ్ వెనుక బంపర్‌తో గొప్ప సూపర్‌కార్‌లా కనిపిస్తుంది. అంతేకాకుండా  ఈ కార్ సాధారణ హురాకాన్ కంటే హై ఉంటుంది.

ఇంజిన్ పవర్
ఈ సూపర్‌కార్‌లో కంపెనీ ఎలాంటి పవర్‌ఫుల్ ఇంజన్ ఇవ్వనుందనే సమాచారం నవంబర్ 30న మాత్రమే తెలియనుంది. కానీ దీనికి 5.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ వి10 ఇంజన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్ నుండి కారు 640 హార్స్‌పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్ హురాకాన్ ఈవోలో కూడా ఇచ్చారు.

బెస్ట్ డ్రైవింగ్ కోసం కొత్త హురాకాన్ స్టెరాటో 
కొత్త హురాకాన్ స్టెరాటోను నడపడం చాలా సరదాగా ఉంటుందని కంపెనీ తెలిపింది. లంబోర్ఘిని కొత్త హురాకాన్ స్ట్రాటోను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. దుమ్ము లేదా ధూళి ప్రదేశాలలో కూడా బెస్ట్ డ్రైవింగ్ ఆనందం కోసం రూపొందించిన మొదటి సూపర్ స్పోర్ట్స్ కారు.  

ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్
నివేదికల ప్రకారం, ఈ లంబోర్ఘిని కారు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ తో  వస్తున్న చివరి కారు. చాలా అత్యుత్తమ కార్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. వీటిలో హురాకాన్, అవెంటడోర్, ఎస్‌యూ‌వి ఉరస్ ఉన్నాయి. భవిష్యత్తులో  ఫ్యూయెల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లతో భర్తీ చేసేందుకు కంపెనీ కృషి చేస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios