బజాజ్ పల్సర్ కొత్త ఎడిషన్: అరెవ్వా... రిచ్ లుక్ లో బెస్ట్ ప్రైస్, మంచి ఫీచర్లు కూడా..
కొత్త బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ బ్లూ అండ్ రెడ్, కొత్త బాడీ గ్రాఫిక్స్ తో రెండు కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కొత్త అప్డేట్లు లేటెస్ట్ ఎంట్రీ-లెవల్ పల్సర్ బైక్స్ మార్పులను చూస్తాయి.
ఇండియన్ ఆటోమోటివ్ కంపెనీ బజాజ్ ఆటో భారతదేశంలో కొత్త పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ యొక్క సింగిల్-సీట్ వెర్షన్ ధరను రూ. 89,254 అండ్ స్ప్లిట్-సీట్ వెర్షన్ ధర రూ. 91,642 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. కొత్త బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ బ్లూ అండ్ రెడ్, కొత్త బాడీ గ్రాఫిక్స్ తో రెండు కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కొత్త అప్డేట్లు లేటెస్ట్ ఎంట్రీ-లెవల్ పల్సర్ బైక్స్ మార్పులను చూస్తాయి. బాడీ గ్రాఫిక్స్ బైక్ హెడ్‌ల్యాంప్ కవర్, ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రంట్ ఫెండర్, టెయిల్ సెక్షన్, బెల్లీ పాన్ ఇంకా అల్లాయ్ వీల్స్‌ను కవర్ చేస్తుంది.
ఇంజన్ అండ్ పవర్
పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌కు ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. కొత్త ఎడిషన్ కూడా 124.4cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ పొందుతుంది, 8,500rpm వద్ద 11.64 bhp శక్తిని, 6,500rpm వద్ద 10.8Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు.
ఈ ఎడిషన్లు క్లాసిక్ పల్సర్ డిజైన్ లాంగ్వేజ్‌తో సింగిల్-పాడ్ హెడ్‌ల్యాంప్, బోల్ట్ ష్రౌడ్తో కూడిన మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, బ్లాక్-అవుట్ సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్‌ను పొందాయి. సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంటుంది.
బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్
బైక్ సస్పెన్షన్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్లను పొందుతుంది. బ్రేకింగ్ కోసం 240ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ యూనిట్ లభిస్తుంది. ఈ బైక్ 6-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
కొత్త బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ పల్సర్ 125 నియాన్ ఎడిషన్‌తో పాటు అందుబాటులో ఉంటుంది. పల్సర్ 125 నియాన్ ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించారు. ఈ బైక్ కాస్త బడ్జెట్ ధరలో లభిస్తుంది, దీని ధర రూ. 87,149 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
బజాజ్ పల్సర్ 125 సెగ్మెంట్లో అత్యధికంగా ప్రయత్నించిన, పరీక్షించిన బైక్‌లలో ఒకటి, అలాగే దాని సెగ్మెంట్లో మని వాల్యు బైక్స్ లో ఒకటి. ఈ బైక్ మరింత బడ్జెట్ ధర వద్ద పెద్ద పల్సర్ బ్రాండ్ స్పోర్టినెస్ని అందిస్తుంది. పల్సర్ 125 ఈ సెగ్మెంట్లోని హోండా SP 125, హీరో గ్లామర్ 125 వంటి బైక్‌లతో పోటీపడుతుంది.