ఏలూరు యాసిడ్ దాడి ఘటన.. ముగ్గురికి జీవిత ఖైదు.. 117 రోజుల్లోనే శిక్ష ఖరారు!!
Oct 12, 2023, 10:11 AM ISTఏలూరులో 35 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు బోడ నాగ సతీష్, బెహరా మోహనం, ఉషా కిరణ్‌లను దోషులుగా నిర్దారించిన ఏలూరు జిల్లా ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు.. వారికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.