తస్మాత్ జాగ్రత్త.. *401* కోడ్‌తో డెలివరీ బాయ్‌ను కాంటాక్ట్ అవ్వాలని కాల్స్.. అలా చేశారంటే.. (వీడియో)
ప్రజలను మోసం చేయడానికి నేరగాళ్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా డెలివరీ బాయ్ పేరుతో కొత్త మార్గంలో స్కామ్‌కు తెరదీశారు.
ప్రజలను మోసం చేయడానికి నేరగాళ్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా డెలివరీ బాయ్ పేరుతో కొత్త మార్గంలో స్కామ్‌కు తెరదీశారు. దీని ప్రకారం.. ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీకు డెలివరీ వచ్చిందని చెబుతాడు. అయితే డెలవరీ బాయ్‌కు మీ అడ్రస్ గుర్తించలేకపోతున్నాడని..అతనికి సహాయం చేయాలని చెబుతాడు. ఆ తర్వాత చివరికి డెలివరీ సిబ్బందిని ఎలా సంప్రదించాలనేది చెబుతున్నట్టుగా యాక్ట్ చేస్తారు. డెలివరీ బాయ్ నెంబర్ చెప్పి.. దానికి కాల్ చేసే ముందు *401* యాడ్ చేయాలని చెబుతారు. *401* తర్వాత తాము చెప్పిన నెంబర్‌ను డయల్ చేయాలని కోరతారు.
అయితే ఒక మహిళ ఇటీవల ఈ స్కామ్‌తో తన అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె ఇతరులను అప్రమత్తంగా ఉండాలని, ఈ మోసపూరిత స్కామ్ బారిన పడకుండా ఉండమని హెచ్చరించింది. అంతేకాకుండా *401* అనేది కాల్ ఫార్వార్డింగ్ కోడ్ అని.. అలా చేస్తే కాల్స్, ఓటీపీలు, మెసేజ్‌లు ఇతర వివరాలు ఆ నెంబర్‌కు ఫార్వార్డ్ అవుతాయని పేర్కొన్నారు. ఈ మోసం ఉచ్చులో చిక్కుకోవద్దని కోరారు.
ఆ వీడియో ప్రకారం.. స్కామర్ ఒక డెలివరీ బాయ్ అడ్రస్‌ను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పాడు. చట్టబద్ధంగా కనిపించడానికి.. స్కామర్ డెలివరీ బాయ్‌తో కనెక్ట్ అయ్యే ముందు అవసరమైన కంపెనీ ఎక్స్‌టెన్షన్ కోడ్‌గా *401* డయల్ చేయమని సూచించాడు. డెలివరీ చేసే వ్యక్తి ఫోన్ నంబర్‌కు ముందు ఈ కోడ్ డయల్ చేయమని చెప్పాడు.
అయితే ఏదో తప్పుగా భావించిన మహిళ.. *401* కోడ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించడానికి గూగుల్ సెర్చ్ చేసింది. అయితే ఆ కోడ్ అనేది కాల్ ఫార్వార్డింగ్ కమాండ్ అని వెల్లడైంది. ఆ కోడ్‌కు డయల్ చేసినట్లయితే.. ఇది అన్ని ఇన్‌కమింగ్ కాల్‌లు, సందేశాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు) వంటి కీలకమైన డేటాను *401* కమాండ్‌తో లింక్ చేసిన నంబర్‌కి వెళ్తాయని గూగుల్ సెర్చ్ ద్వారా తెలిసింది. అందుకే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.