Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్‌గఢ్‌‌లో ముగ్గురిని హత్య చేసిన మావోయిస్టులు.. ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఘటన..

బస్తర్ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని ఒక గ్రామంలోని ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. కాంకేర్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

Three villagers killed by Naxalites in poll-bound Chhattisgarh's Kanker district ksm
Author
First Published Nov 2, 2023, 2:49 PM IST

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బస్తర్ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని ఒక గ్రామంలోని ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. కాంకేర్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబెథియా పోలీస్ స్టేషన్ (కాంకేర్) పరిధిలోని మోర్‌ఖండీ గ్రామంలో నివాసముంటున్న కుల్లే కట్లామి (35), మనోజ్ కొవాచి (22), దుగ్గే కొవాచి (27)లను మావోయిస్టులు హత్య చేశారు. గత అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 

మృతులు మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల కోసం తయారు చేసిన మహారాష్ట్ర పోలీసుల ప్రత్యేక దళం సి60కి ఇన్‌ఫార్మర్ల ఇన్‌ఫార్మర్లు అని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు ఘటనా స్థలంలో విసిరిన కరపత్రాలలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదిలాఉంటే, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కాంకేర్ పట్టణంలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios