వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా లండన్ వెళుతున్నారు. పెద్ద కూతురు హర్షకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అడ్మిషన్ దొరికింది. కళాశాలలో కూతురును చేర్చటానికి జగన్ కుటుంబం మొత్తం ఈనెల 11వ తేదీన లండన్ బయలుదేరుతోంది. మళ్ళీ తిరిగిరావటం 19వ తేదీనే.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా లండన్ వెళుతున్నారు. పెద్ద కూతురు హర్షకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అడ్మిషన్ దొరికింది. కళాశాలలో కూతురును చేర్చటానికి జగన్ కుటుంబం మొత్తం ఈనెల 11వ తేదీన లండన్ బయలుదేరుతోంది. మళ్ళీ తిరిగిరావటం 19వ తేదీనే. జగన్ విద్యార్హతలపై అనేక వివాదాలను టిడిపి సృష్టించినా కూతరు చదువు విషయంలో మాత్రం మాట్లాడేందుకు ఏమీ లేదు. జగన్ గురించి అసెంబ్లీలోను బయట స్వయంగా చంద్రబాబునాయుడే అనేక మార్లు కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తానికి జగన్ కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ద కళాశాలలో ఉన్నత చదువు చదవటం అందరూ సంతోషించతగ్గ విషయమే కదా?
