MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Telangana
  • Vinayaka Chavithi Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే

Vinayaka Chavithi Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే

ప్రతి వినాయక చవితికి ఒకేరోజు సెలవు ఉంటుంది… కానీ ఈసారి అలాకాదు, ఏకంగా ఆరురోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి ఈసారి పండగను యువత సరికొత్త జోష్ తో జరుపుకోవచ్చు.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 06 2026, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వినాయక చవితికి సెలవులే సెలవులు
Image Credit : Gemini AI

వినాయక చవితికి సెలవులే సెలవులు

School Holidays : వినాయక చవితి పండగ వస్తోంది... ఇక ప్రతి నగరం, పట్టణం, గ్రామం పండగ శోభతో కళకళలాడతాయి. వీధివీధిలో బొజ్జ గణపయ్య విగ్రహాలు కొలువుదీరతాయి… వాడవాడా విద్యుత్ కాంతులతో మెరిసిపోతాయి. ఇక వినాయక మండపాల వద్ద యువత సందడి మామూలుగా ఉండదు... ఆటాపాటలతో పండగ సంబరాలు అంబరాన్నంటుతాయి. అందుకే వినాయక చవితి పండగను స్కూల్ విద్యార్థుల నుండి కాలేజీ యువత వరకు ఇష్టపడుతుంటారు. నిత్యం తమ మండపం దగ్గరే ఉండాలని చాలామంది కోరుకుంటారు.. కానీ స్కూల్, కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం దొరకదు.

అయితే ఈసారి వినాయక చవితికి ఊహించనివిధంగా వరుస సెలవులు వస్తున్నాయి. ఎన్నిరోజులు సెలవో తెలిస్తే విద్యార్థులు ఎగిరిగంతేయడం ఖాయం. వినాయక చవితికి ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా ఆరురోజులు సెలవులు వస్తున్నాయి... ఈ సెలవుల్లో విద్యార్థులు వినాయక ప్రతిష్ఠ, నిమజ్జనం వంటి కార్యక్రమాలను ధూమ్ ధామ్ గా జరుపుకోవచ్చు. సాధారణంగా ప్రతి వినాయక చవితి ఒక్కరోజే సెలవు ఉంటుంది... మరి ఈసారి ఆరు రోజులు సెలవులు ఎలా వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వినాయక చవితికి మూడ్రోజుల సెలవులు
Image Credit : ChatGPT

వినాయక చవితికి మూడ్రోజుల సెలవులు

వచ్చేవారమే వినాయక చవితి పండగ ఉంది... ఈరోజే గణపతి విగ్రహాలను గల్లీగల్లిలో, వాడవాడలో ప్రతిష్ఠిస్తారు. సెప్టెంబర్ 14 (సోమవారం) వినాయక చవితి సందర్భంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఇచ్చేశాయి. అంటే స్కూల్ విద్యార్థుల నుండి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వరకు అందరికీ సెలవే... పండగను అందరూ కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు వీలుగా ఈ సెలవు ఇచ్చారు.

అయితే ఈ వినాయక చవితికి మరో రెండు సెలవులు కలిసివస్తున్నాయి. ఈ వీకెండ్ లో రెండో శనివారం వస్తోంది... కాబట్టి ప్రతి నెలలో మాదిరిగానే సెప్టెంబర్ 12న రెండో శనివారం హాలిడే ఉంటుంది. ఇక తర్వాత వచ్చే ఆదివారం సాధారణ సెలవే... అంటే సెప్టెంబర్ 13న కూడా సెలవు. ఇలా వినాయక చవితి సెప్టెంబర్ 14న అయితే దానికి ముందు రెండ్రోజుల వీకెండ్ సెలవులు కలిసివస్తున్నాయి. పండగ సెలవుతో వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ మారనుంది.

వినాయక చవితికి ముందు మండపం నిర్మాణం, విగ్రహాల ఎంపిక, తరలింపు వంటి పనులు ఉంటాయి... కాబట్టి యువత తీరికలేకుండా బిజీబిజీగా ఉంటారు. అయితే ఈసారి పండక్కి ముందు వచ్చే సెలవులు వీరికి కలిసిరానున్నాయి... స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి క్లాసులు మిస్ కాకుండా వినాయక చవితి పనులు చేసుకోవచ్చు.

Related Articles

Related image1
School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Related image2
September Holidays : సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
34
వినాయక నిమజ్జనానికీ మూడ్రోజులు సెలవులే
Image Credit : X/WonderVinod

వినాయక నిమజ్జనానికీ మూడ్రోజులు సెలవులే

వినాయక చవితికి అంటే గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఎంత హడావిడి ఉంటుందో నిమజ్జనం సమయంలోనూ అంతే సందడి ఉంటుంది. అయితే లక్కీగా వినాయక ప్రతిష్ఠ, నిమజ్జనం రెండూ వీకెండ్ లోనే వస్తున్నాయి... కాబట్టి స్కూల్స్, కాలేజీలకు డుమ్మా కొట్టే అవసరం లేకుండానే విద్యార్థులు సెలవులు పొందుతున్నారు. వినాయక నిమజ్జనాని కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులు కలిసివస్తున్నాయి.

ప్రతిసారి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత 3,5,7.9,11 రోజులకు నిమజ్జనం చేస్తారు. అయితే హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద నగరాల్లో 11 రోజుల నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందుకే వినాయక నిమజ్జనం రోజు కూడా చాలా ప్రాంతాల్లో సెలవు ఉంటుంది.. ఇలా సెప్టెంబర్ 25న మరో సెలవు రానుంది. మిగతా ప్రాంతాల్లో ఏమోగానీ హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అయితే ప్రతిసారి వినాయక నిమజ్జనానికి అధికార సెలవు ఇస్తున్నారు… ఈసారి కూడా సెలవు పక్కా.

అయితే సెప్టెంబర్ 25న అంటే శుక్రవారం విమజ్జనం సెలవు వస్తోంది. తర్వాత సెప్టెంబర్ 26 శనివారం... ఈరోజు కొన్ని విద్యాసంస్థలతో పాటు ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు వీకెండ్ సెలవు ఉంటుంది. ఇక సెప్టెంబర్ 27 ఆదివారమే కాబట్టి సాధారణ సెలవే. ఇలా వినాయక చవితే కాదు నిమజ్జనానికి కూడా తెలుగు విద్యార్థులకు వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి... ఇలా ఈ గణపతి పండక్కి మొత్తంగా ఆరురోజులు సెలవులు కలిసివస్తున్నాయి.

44
వినాయక చవితి సెలవుల లిస్ట్
Image Credit : Instagram

వినాయక చవితి సెలవుల లిస్ట్

సెప్టెంబర్ 12 - రెండో శనివారం సెలవు

సెప్టెంబర్ 13 - ఆదివారం సెలవు

సెప్టెంబర్ 14 (సోమవారం) - వినాయక చవితి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారిక సెలవుంది

సెప్టెంబర్ 25 (శుక్రవారం) - వినాయక నిమజ్జనం సెలవు

సెప్టెంబర్ 26 (శనివారం) - వీకెండ్ సెలవు

సెప్టెంబర్ 27 - ఆదివారం సెలవు

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పండుగలు
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence
Recommended image2
Telangana: స్పీకర్ ఎందుకు కంటతడి పెట్టుకున్నారు.? అసలు అసెంబ్లీలో ఏం జరిగింది.?
Recommended image3
Telangana: తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగాలు.. జ‌పాన్‌తో కీల‌క ఒప్పందాలు
Related Stories
Recommended image1
School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Recommended image2
September Holidays : సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved